
అకస్మాత్తుగా చెలరేగిన మంటలు
హైదరాబాద్‌లోని రహమత్‌నగర్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్ వద్ద గురువారం భారీ అగ్నిప్రమాదం(Fire accident) చోటుచేసుకుంది. ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో అక్కడ నిలిపివున్న మూడు కార్లు, ఒక ఆటో దగ్ధమయ్యాయి. సమీపంలో ఉన్న మరికొన్ని వాహనాలు కూడా మంటల బారిన పడటంతో ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
Read also: Hyderabad: హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు
అగ్ని ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, ఫైర్ సర్వీస్‌కు సమాచారం అందించారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు కూడా రక్షణ చర్యలు చేపట్టి ప్రజలను ఆ ప్రాంతం నుంచి దూరంగా తరలించారు.
గంజాయి మత్తులో నిప్పంటించాడా?
ఈ ప్రమాదానికి కారణం ఏమిటన్న దానిపై విచారణ కొనసాగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, గంజాయి సేవించి మత్తులో ఉన్న వ్యక్తి చెత్తకు నిప్పు పెట్టిన కారణంగా అగ్ని చెలరేగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: