హైటెక్ సంస్కృతి (Hi-tech culture) లో మనం కూడా విచ్చలవిడితనాన్ని అలవర్చుకుంటున్నాం. ప్రత్యేకంగా సోషల్ మీడియా వచ్చాక చిన్నవయసులోనే చెడు వ్యసనాలకు గురవుతున్నారు. నాగరికత పేరుతో విశృంఖలత్వానికి పాల్పడతున్నారు. వయసుకు మించి పనులు చేస్తూ, అందమైన తమ కెరీర్ జీవితాలను పాడుచేసుకుంటున్నారు.
Crime News: ఛత్తీస్‌గఢ్ లో ఘోర రోడ్డుప్రమాదం-ఐదుగురు మృతి
తాజాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ (Moinabad) లోని ఫాంహౌస్ లో ఆదివారం మైనర్ల డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది.పెద్దమంగళారంలోని చెర్రీ ఓక్స్ ఫామ్ హౌస్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ ఫాంహౌస్ పార్టీలో 50మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పార్టీలో 14మంది బాలికలు, 34 మంది మైనర్లు పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.
వారందరికి డ్రగ్ టెస్ట్ చేయగా ఇద్దరికి గంజాయి పాజిటివ్ వచ్చింది. ఇంటర్ విద్యార్థులు కిషన్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్లేయేన్సర్ సాయంతో పార్టీ ప్రణాళిక చేశారు. అతడు ఇన్స్టాగ్రాం (Instagram) లో ట్రాప్ హౌస్ పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.1600 వసూలు చేశాడు.

భారీగా మద్యం, డ్రగ్స్ స్వాధీనం
రాజేంద్రనగర్ ఎస్ ఓటీ పోలీసులు 8మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఫాంహౌస్ ను క్షుణ్ణంగా తనిఖీ చేసి పార్టీలో భారీగా డ్రగ్స్,గంజాయి, మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఫామ్ హౌస్ (farmhouse) యజమానితో పాటు మరో నలుగురురిపై కేసులు నమోదు చేశారు. పార్టీలో పాల్గొన్న ఇంటర్ విద్యార్థులను విచారిస్తున్నారు.
కాలేజీకి వెళ్తున్నామని ఇంట్లో చెప్పి, చెడు స్నేహితులతో తిరుగుతూ, చెడు వ్యసనాలకు గురవుతున్న యువతపై మైనర్ బాలబాలికలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడుతున్నదని పోలీసులు వాపోతున్నారు.
అందుకే ఇలాంటి అసాంఘిక సంఘటనలు చోటుచేసుకోవడం విచారణకమని అంటున్నారు. కుటుంబసభ్యులు, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల శ్రద్ధ, పర్యవేక్షణ తప్పనిసరి అని లేకపోతే వారి బంగారు భవిత అంధకారంలో మగ్గిపోయే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: