హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ కారు బాంబు పేలుడు(Delhi blast) ఘటనకు గుజరాత్‌లో అరెస్టయిన నలుగురు ఐసిస్ ఉగ్రవాదులతో(Terrorist) సంబంధం ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. ఈ కుట్ర, పేలుడుకు హైదరాబాద్‌కు(Hyderabad) చెందిన వైద్యుడు అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌తో ఢిల్లీ పేలుడుకు సంబంధం ఉన్న కాశ్మీర్, యూపీకి చెందిన ముగ్గురు వైద్యులకు, ఆత్మాహుతి దళ సభ్యుడిగా భావిస్తున్న మరో వైద్యుడికి సంబంధాలున్నట్లు విచారణలో వెల్లడైంది. దీంతో రెండు రోజుల వ్యవధిలో రట్టయిన రెండు కుట్రలు, ఒక భారీ పేలుడుకు హైదరాబాద్‌లో లింకులున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Also: Lokesh Big Announcement : ఈరోజు 9 గంటలకు లోకేష్ కీలక ప్రకటన

ఐఎస్ఐ-ఐసిస్ ఉమ్మడి కుట్రపై అనుమానం
ఢిల్లీ కారు బాంబు పేలుడులో ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఐసిస్ ఉగ్రవాదులు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భారత్‌లో జరిగిన ఉగ్ర కుట్రల్లో ఐఎస్ఐది ప్రధాన భాగం. కానీ తొలిసారిగా ఈ రెండు సంస్థలు కలిసి ఢిల్లీ పేలుడుకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
- గుజరాత్‌లో అరెస్టులు: గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా రహస్య కార్యకలాపాలు సాగిస్తున్న ఐసిస్ ఉగ్రవాదులు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సుహేల్‌లను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు జప్తు చేశారు.
- కశ్మీర్, యూపీలో అరెస్టులు: అదే రోజున జమ్మూ కాశ్మీర్, హరియాణా, యూపీలోని లక్నోలో పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి, కాశ్మీర్‌లోని కుల్గాంకు చెందిన డాక్టర్ ఆదిల్, పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మిల్ ఆహ్లాద్, లక్నోకు చెందిన మహిళా వైద్యురాలు డాక్టర్ షహీన్ షహీద్‌లను అరెస్టు చేశారు.
ఉగ్రవాద భావజాలం, నిధులు
కశ్మీర్, యూపీలలో పట్టుబడ్డ వైద్యులు జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న నిషిద్ధ జైష్ ఏ మహమ్మద్, అన్సార్ ఘజీవత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలకు చెందినవారుగా తేలింది. వీరు యువతలో ఉగ్రవాద భావజాలాన్ని ప్రేరేపించి ఉగ్ర సంస్థల్లో చేర్పించడం, లాజిస్టిక్స్ ఏర్పాటు చేయడం, ఆయుధాలు, మందుగుండు సామగ్రి అందించడం, ఐఈడీ బాంబుల తయారీపై శిక్షణ ఇవ్వడం వంటివి నిర్వహిస్తున్నట్లు తేలింది. ఇందుకోసం వైద్యులు ఎన్‌క్రిప్టెడ్ ఛానెళ్లను వాడినట్లు పోలీసులు తెలిపారు.
ఆత్మాహుతికి పాల్పడింది జైష్-ఏ-మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాది, పుల్వామా నివాసి అయిన డాక్టర్ ఉమర్ నబీ అని అనుమానిస్తున్నారు. ఈ ఉగ్రవాదులు బాంబు పేలుళ్లతో పాటు, విషపదార్థాలను మార్కెట్లలో వెదజల్లి సామూహికంగా అమాయకులను చంపాలని కూడా వ్యూహాలు రచించినట్లు విచారణలో తేలింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: