హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రాంతంలో తీవ్ర అగ్ని ప్రమాదం(Cylinder Blast) చోటుచేసుకుంది. మంగళవారం (జనవరి 13) రాత్రి కూకట్‌పల్లి రాజీవ్ గాంధీ నగర్‌లో ఉన్న ఓ గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రీఫిల్లింగ్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో గ్యాస్ లీక్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.
Read Also:Tadipatri crime: మద్యం మత్తులో వ్యక్తి మృతి
మంటలు భారీగా ఎగిసిపడటంతో(Cylinder Blast) పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు.
ప్రమాద సమయంలో గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలుతున్న శబ్దాలు వినిపించడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. దాదాపు ఎనిమిది సిలిండర్లు పేలినట్లు తెలుస్తోంది. భద్రతా చర్యలలో భాగంగా రీఫిల్లింగ్ స్టేషన్ చుట్టుపక్కల నివాసితులను అధికారులు వెంటనే ఖాళీ చేయించారు. ఈ ప్రమాదానికి గల అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: