ఇమ్మడి రవి (Cine Pirasi) అలియాస్ ప్రహ్లాద్ కుమార్ ప్రస్తుతం మీడియాలో ఇతని గురించి ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది. ఇతనిది సొంతజిల్లా విశాఖపట్నం. అక్కడే బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తిచేశాడు. ఉద్యోగవేటలో ముంబయి చేరి పలు ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తూనే ఎంబీయే పూర్తి చేశాడు. 2010లో హైదరాబాద్ చేరి ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ పారంభించాడు.
Read Also: Maoist: ఏలూరులోనూ మావోయిస్టుల కలకలం!
వెబ్ సైట్ డిజైనింగ్, డొమైన్ రిజిస్ట్రేషన్, నిర్వహణపై పట్టు సాధించాడు. ఇంటర్నెట్ సౌకర్యం తేలికగా అందుబాటులోకి వస్తుండటం, ఓటీటీలకు డిమాండ్ పెరుగుతుండటాన్ని గమనించాడు. సినిమాలు, వెబ్ సీరిస్ లు అందుబాటులో ఉంచితే ప్రకటనల రూపంలో బాగా సంపాదించొచ్చని ఆలోచించాడు.

ఆన్ లైన్ బెట్టింగ్, రేమింగ్ యాప్ లు
2020లో కరోనా లాక్ డౌన్ తో జనం ఇళ్లకే పరిమితమవడం, ఆ సమయంలో ఓటీటీ వేదికలకు డిమాండ్ పెరగటంతో అదే ఏడాది ఐ బొమ్మ వెబ్ సైట్ రూపొందించాడు. ఆన్ లైన్ బెట్టింగ్, రేమింగ్ యాప్ ల ప్రచారానికి అందులో వీలు కల్పించాడు. సినిమాలు, వెబ్ సీరిస్ లను ఉచితంగా వీక్షించవచ్చంటూ సామాజిక మాధ్యమాలు, టెలిగ్రామ్(Telegram) గ్రూపుల్లో విస్తృత ప్రచారం చేశాడు. ఆరేళ్లుగా పలు భాషల సినిమాలు పైరసీ చేసి భారతీయ చలనచిత్ర రంగానికి రూ.వేల ఓకట్ల నష్టానికి కారకుడయ్యాడు. కోట్లు సంపాదించాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: