
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. చేవెళ్ల మండల(Chevella Accident) పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం వేళ ఉద్యోగులు, విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సును కంకరతో నిండిన టిప్పర్ లారీ వేగంగా ఢీకొట్టింది. ఢీ కొట్టిన ప్రభావానికి బస్సు కుడివైపున కూర్చున్న ప్రయాణికులపై లారీలోని కంకర మొత్తం పడి, ఊపిరాడక పలువురు అక్కడికక్కడే మృతి చెందారు.
Read Also: Chevella Accident: రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్బ్రాంతి
మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన టిప్పర్ బస్సుపైకి దూసుకెళ్లి విషాదం
సాక్షులు చెబుతున్న మేరకు, టిప్పర్ మితిమీరిన వేగంతో వస్తూ బస్సుపైకి దూసుకెళ్లిందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే రక్షణ బృందాలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ప్రమాదం తాలూకు(Chevella Accident) దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. బస్సు కిటికీలు పగిలిపోగా, కంకర రాళ్ల ముద్దలో పలువురు చిక్కుకున్నారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి రక్షణ చర్యల్లో పాల్గొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) పరిస్థితిని సమీక్షించి, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదానికి కారణం టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: