హైదరాబాద్ BJP : రాష్ట్రంలో బిసిలకు చెందాల్సిన రిజర్వేషన్లు (Reservation) బిసిలకే దక్కాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అన్నారు. సోమ వారం నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఇందూర్లో బూత్ స్థాయి సభ్యుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు యూరియా కొరత అంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, బిజెపి ఎక్కడా కూడా యూరియా పంపిణీని ఆపలేదు. తెలంగాణకు అవసరమైనంత మేరకు యూరియా సరఫరా చేసిందన్నారు. తెలంగాణలో నడుస్తోంది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ యూరియా కొరత మాత్రమే అన్నారు. తాను పలు జిల్లాల్లో పర్యటించి కలెక్టర్లతో మాట్లాడాడనని, ఎక్కడా కూడా యూరియా కొరత లేదని వారు చెప్పారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా రైతులకు బేడీలు వేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వమని, రైతుల ఆత్మ హత్యలు ఎక్కువగా కూడా జరిగినది బిఆర్ఎస్ (BRS) పాలనలోనే. అందుకే రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బిఆర్ఎస్కు లేదన్నారు. ఈ సందర్భంగా ఎంపి ధర్మ పురి అర్వింద్ జన్మదినం సందర్భంగా హృద యపూర్వక శుభాకాంక్షలు తెలిపిన ఆయన రూ.25 లక్షల వరకు ధర్మపురి అర్వింద్ ట్రస్ట్ ద్వారా కార్యకర్తల సంక్షేమం కోసం వితరణ చేశారు. కార్యకర్తల పట్ల అర్విందికి ఉన్న ప్రేమ గొప్పది అన్నారు.

నిజామాబాద్లో పసుపు బోర్డు ప్రధాని మోడీ గొప్పతనం – అర్వింద్
నిజామాబాద్లో పసుపు బోర్డు రావడం ప్రధాని నరేంద్ర మోడీ గొప్పతనం, అర్వింద్ అలుపెరుగని ప్రయత్నం అన్నారు. ప్రధాని మోడీ తెలంగాణలో 32 లక్షల మంది రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేశారన్నారు. తెలం గాణలో రైతుబంధు బంద్ అయిందని, తెలంగా ణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల పేరుతో, గ్యారంటీల పేరుతో అనేక వాగ్దానాలు చేసి మాట తప్పిందన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వలేదని, రైతు భరోసా సరిగ్గా ఇవ్వలేదన్నారు. 19 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇండ్ల చొప్పున పేదలకు ఇళ్లు కడతామని చెప్పారు, కానీ అమలు చేయలేదన్నారు. అన్నీ అబద్ధాలతోనే కాంగ్రెస్ కాలయాపన చేస్తుందన్నారు. ఓటు చోరీతోనే గెలుస్తోందని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :