हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Baby dead: వేడి నీటి బకెట్‌లో పడి నాలుగేళ్ళ బాలుడి మృతి

Ramya
Baby dead: వేడి నీటి బకెట్‌లో పడి నాలుగేళ్ళ  బాలుడి మృతి

జవహర్‌నగర్‌లో విషాద ఘటన

జవహర్‌నగర్‌లో ఓ హృదయవిదారక ఘటన జరిగింది. ఆడుకుంటున్న చిన్నారి బన్నీ (4) అనుకోకుండా వేడినీటి బకెట్‌లో పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచాడు.

ఈ సంఘటన తల్లిదండ్రులను కన్నీటి స‌ముద్రంలో ముంచేసింది. కాటి నర్సింహ-సుమలత దంపతుల కుమారుడైన బన్నీ, ఆ రోజు పుట్టింటికి వచ్చిన తన అమ్మమ్మతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. అయితే అక్కడ ఉన్న వేడినీటి బకెట్‌లో ప్రమాదవశాత్తూ పడిపోవడంతో అతడి ఛాతి తీవ్రంగా కాలిపోయింది.

వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చిన్నారి మృతితో కుటుంబసభ్యులు కనీరుమున్నిరు అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ప్రతి తల్లిదండ్రులకు గుణపాఠంగా మారాలి. పిల్లల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలి.

బాలుడి కుటుంబ పరిస్థితి

జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లోని బాలాజీనగర్‌ మార్కెట్‌లేన్‌లో నివాసముంటున్న కాటి నర్సింహ, ఆయన భార్య సుమలతలకు ఇద్దరు కుమారులున్నారు. నర్సింహ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల, పిల్లలను చూసేందుకు సుమలత తల్లి పుల్లమ్మ వారి ఇంటికి వచ్చింది. ఈ నెల 23న, పుల్లమ్మ మనుమడు బన్నీ (4)ను తీసుకుని సమీపంలోని సాయి ఇంటికి వెళ్లింది.

విషాదకర సంఘటన ఎలా జరిగింది?

స్నానానికి వాటర్‌ హీటర్‌ పెట్టిన సాయి కుటుంబ సభ్యులు వేడినీటిని బకెట్‌లో పోసి, దానిని అక్కడే ఉంచారు. ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉండగా, ఆడుకుంటున్న బన్నీ అజాగ్రత్తగా వేడినీటి బకెట్‌లో పడిపోయాడు. చిన్నారి ఒక్కసారిగా కేకలు వేసాడు కుటుంబ సభ్యులు పరుగెత్తి వచ్చారు. బన్నీని బయటకు తీసే సరికి ఛాతి భాగం తీవ్రంగా కాలిపోయింది. తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లినా, చిన్నారి ప్రాణాలు కాపాడలేకపోయారు.

ఆసుపత్రిలో చికిత్స – కానీ ఫలితం లేకపోయింది

బాలుడు బకెట్‌లో పడిపోతూనే తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు అతడిని బయటకు తీసి చూసే సరికి ఛాతి భాగం పూర్తిగా కాలిపోయింది. మొదట స్థానిక ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా, మంగళవారం ఉదయం బాలుడు తుది శ్వాస విడిచాడు.

కుటుంబసభ్యుల కన్నీరుమున్నీరే

బన్నీ మరణవార్త తెలియగానే తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్నారి మరణాన్ని తట్టుకోలేక తల్లి సుమలత ఆవేదన వర్ణించలేనిది. కుటుంబసభ్యులంతా కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటన ఊరిలో విషాదాన్ని నింపింది.

పోలీసుల చర్యలు – దర్యాప్తు కొనసాగుతోంది

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జవహర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఇంట్లో అనుకోకుండా జరిగిన ప్రమాదమే బాలుడి మృతికి కారణమని తెలుస్తోంది.

పిల్లల భద్రతకు తల్లిదండ్రుల జాగ్రత్తలు అవసరం

ఈ ఘటన ప్రతి తల్లిదండ్రికీ గుణపాఠంగా మారాలి. పిల్లల్ని ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదిలేయకూడదు. ప్రత్యేకంగా వేడినీటికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు ఆడుకుంటూ ప్రమాదంలో పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870