హైదరాబాద్: రాజ్యాంగ మౌలిక సూత్రాలైన లౌకికవాదం, సామాజిక న్యాయాలను కాపాడుకోవాలని సుప్రీంకోర్టు (Supreme Court) మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి (B. Sudarshan Reddy) అన్నారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 75 సంవత్సరాల భారత రాజ్యాంగం, లౌకికతత్వం, సామాజిక న్యాయంపై రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది జి. విద్యాసాగర్ అధ్యక్షతన జరిగింది.
Read Also: HYD: వ్యవసాయ, అణుశక్తి, బీమాలో సంస్కరణలు

రాజ్యాంగ పరిరక్షణకు ప్రజల బాధ్యత
జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, అనేకమంది మేధావులు, సామాన్యులు తమ అభిప్రాయాలతో భారత రాజ్యాంగం ఏర్పడిందని చెప్పారు. ప్రస్తుతం రాజ్యాంగంతోపాటు పై రెండు అంశాలు ప్రమాదంలో పడ్డాయని, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని అన్నారు.
పార్లమెంట్ సభ్యుల పాత్ర: రాజ్యాంగం పై (Constitution) ప్రమాణం చేసిన పార్లమెంట్ సభ్యులపై రాజ్యాంగ పరిరక్షణ, లౌకికవాదం, సామాజిక న్యాయాన్ని కాపాడవలసిన బాధ్యత ఉందని చెప్పారు. వాటి అమలులో తప్పులు జరిగినప్పుడు పార్లమెంట్ సభ్యులపై పౌరులే ఒత్తిడి తీసుకొని వచ్చి అమలు జరిగేలా చూసుకోవాలని తెలియజేశారు.
సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు
వివిధ సంఘాల నుండి హాజరైన ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి రెండు గంటలపాటు సమాధానాలు చెప్పారు. ఆలిండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. పార్థసారథి, వేదిక సభ్యులు కామేశ్ బాబు, డి.ఎ.ఎస్.వి. ప్రసాద్, కె. ఉమామహేశ్వర రావు, విద్యార్థి, యువజన, రైతు, కార్మిక, మహిళా, న్యాయవాద, సామాజిక, రచయితల, జర్నలిస్ట్, గిరిజన, ఐఎఎస్ అకాడమీల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. వందన సమర్పణ డి.ఎ.ఎస్.వి. ప్రసాద్ చేశారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: