భారత్-పాకిస్తాన్ సంబంధాలు పతన స్థితిలో కొనసాగుతున్న తరుణంలో, దేశంలో అంతర్గత భద్రతపై తీవ్రమైన బెదిరింపు సంఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తుండగా, హైదరాబాద్‌లో ఐసిస్ సంబంధాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.

పేలుళ్లకు కుట్ర – హైదరాబాద్‌లో సంచలనం
తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ (CI) విభాగం ఓ కీలక ఇంటెలిజెన్స్ ఆధారంగా, విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ (29), హైదరాబాద్‌కి చెందిన సయ్యద్ సమీర్ (28) అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. వీరిద్దరూ నగరంలో డమ్మీ బ్లాస్టింగ్ ద్వారా ట్రయల్ చేయాలని, అనంతరం వాస్తవ బాంబ్ పేలుళ్లకు సిద్ధం కావాలని యత్నించినట్లు సమాచారం.
ఐసిస్ కలకలం
పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల్లో ఒక అభద్రతాభావం మొదలైంది. ఇక హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే ప్రజలు బిక్కుబిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు. ఏ క్షణాన ఏం వార్త వినాల్సి వస్తుందోనని భయంతో ఉన్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోనూ ఉగ్రమూలాలు ఉన్నాయని తేలింది. దీంతో తెలుగు రాష్ట్రాల పోలీసు యంత్రాంగం తీవ్రంగా గస్తీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు హైదరాబాద్ లో భారీ పేలుళ్లకు పన్నిన భగ్నం చేశారు. నగరంలో విధ్వంసానికి కుట్ర చేసిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ , సయ్యద్ సమీర్ లను అరెస్ట్ చేశారు. అరెస్టయిన సిరాజ్, సమీర్ లకు ఐసిస్ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. వారి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు దుండగులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. హైదరాబాద్ లో డమ్మీ బ్లాస్టింగ్చేసేందుకు వీరు యత్నించినట్లు సమాచారం. దీనిపై పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విచారణ కొనసాగుతోంది
ప్రస్తుతం ఈ ఇద్దరిని రహస్య స్థలంలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే దగ్గర్లోని పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో జరిగే ఎలాంటి దుష్ప్రచారాలను నమ్మొద్దన్నారు. ఫేక్ న్యూస్ కు దూరంగా ఉండాలని తెలిపారు. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారులు సూచించారు. ఈ ఘటన భారత్‌లో అంతర్గత భద్రతపై కొనసాగుతున్న ఉగ్ర ముప్పును మరోసారి బహిర్గతం చేస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు పల్చబడిన ప్రాంతాల్లో, ముఖ్యంగా నగర ప్రజాస్వామ్య కేంద్రాల్లో దాడులకు ప్రయత్నిస్తున్నాయి.
Read also: Narendra Modi: వరంగల్‌లో కొత్త రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ