హైదరాబాద్ : రాష్ట్రంతో ఈశాన్య రాష్ట్రాలమధ్య శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక పరమైన బంధాన్ని మరింతగా పటిష్ఠపర్చేందుకుగాను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవవర్మ (Governor Jishnu Deva Varma) ఆలోచనల మేరకు తెలంగాణ నార్త్ స్ట్ కనెక్ట్, టెక్నో, కల్చరల్ ఫెస్టివల్ అనే పేరుతో రెండు విడతలుగా మూడు రోజులు చొప్పున హైదరాబాద్ (Hyderabad) లో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ తెలంగాణ – నార్త్స్ట్ కనెక్ట్, టెక్నో, కల్చరల్ ఫెస్టివల్ కార్యక్రమాల నిర్వ హణపై గవర్నర్ కార్యాలయ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ గురవారం సంబంధిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.
సాంస్కృతిక శాఖ సంచాలకులు
వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగు (Health Secretary Christina Chong), సెర్ప్ సి.ఈ.ఓ దివ్య, కె. లక్ష్మీ, డైరెక్టర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, ఛీఫ్ ఫెస్టివల్ కోఆర్డినేటర్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ సి.హెచ్. ప్రియాంక, పంచాయితీ రాజ్ శాఖ డైరెక్టర్ శ్రీజన, స్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి సోని బాలదేవి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. గవర్నర్ కార్యాలయ ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ, తెలంగాణా, ఈశాన్య రాష్ట్రాల మధ్య శాస్త్ర, సాంకేతిక, వైద్య, మహిళా సాధికారిత, సాంస్కతిక, క్రీడలు (Sports) తదితర కార్యక్రమాలలో భాగంగా రెండు విడతలలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఇరు వైపులకు సంబందించిన ప్రముఖ సినిమాల ప్రదర్శన
నవంబర్ 20, 21, 22 తేదీలలో మొదటి విడత, నవంబర్ 25, 26, 27 తేదీలలో రెండవ విడత కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు వివరించారు. దీనిలో భాగంగా, తెలంగాణా, ఈశాన్య రాష్ట్రాలలకు సంబందించిన సాంస్కృతిక, సాహిత్య, మ్యూజికల్ కార్యక్రమాలను (Musical programs) ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా, ఇరు వైపులకు సంబందించిన ప్రముఖ సినిమాల ప్రదర్శన, మాహిళా సాధికారత, అభివృద్ధి తదితర అంశాలపై చర్చా వేదికలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్టు అన్నారు. హైదరాబాద్లో మొట్టమొదటి సారిగా నిర్వహించే ఈ కార్యక్రమాలను విజయ వంతం చేయడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: