మహారాష్ట్రలోని నాగ్‌పూర్(Nagapur)లో ఇటీవల జరిగిన ఒక హృదయవిదారక సంఘటన మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది. రక్షాబంధన్ పండుగ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టడానికి వెళ్తున్న ఒక మహిళ తన భర్తతో కలిసి బైక్‌పై ప్రయాణిస్తుండగా ఒక ట్రక్కు ఢీకొట్టడంతో మరణించింది. ఈ దుర్ఘటన నాగ్‌పూర్-జబల్‌పూర్ జాతీయ రహదారిపై జరిగింది. ప్రమాదంలో గాయపడిన ఆమె భర్త అమిత్ యాదవ్, భార్య మృతదేహాన్ని తన స్వగ్రామానికి తరలించడానికి సహాయం కోసం ఎంతగా ప్రాధేయపడినా, ఎవరూ ముందుకు రాలేదు. ఈ నిస్సహాయ స్థితిలో మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో, తన భార్య మృతదేహాన్ని బైక్‌కు కట్టి తీసుకెళ్లాడు.
అమిత్ యాదవ్ మరియు అతని భార్య గత పది సంవత్సరాలుగా నాగ్‌పూర్‌లోని లోనారాలో నివసిస్తున్నారు. రక్షాబంధన్ రోజున మధ్యప్రదేశ్‌లోని కరణ్‌పూర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో భార్య మరణించగా, అమిత్ ఒంటరిగా మిగిలిపోయాడు. సహాయం కోసం వేడుకున్నా ఎవరూ స్పందించకపోవడంతో, ఆయన తన భార్య మృతదేహాన్ని బైక్ వెనుక తాళ్లతో కట్టి, తమ స్వగ్రామానికి తీసుకెళ్లడానికి బయలుదేరాడు. ఈ దృశ్యం చూసి చాలామంది ఆవేదన చెందారు. కొందరు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్‌గా మారింది. ఈ ఘటన చూసిన వాహనదారులు, బాటసారుల నిర్లక్ష్యంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అమిత్ యాదవ్ బైక్‌పై మృతదేహాన్ని తీసుకువెళుతుండగా చూసిన కొందరు వాహనాలను ఆపడానికి ప్రయత్నించినా, అతను పట్టించుకోలేదు. చివరికి హైవే పోలీసులు అతడిని వెంబడించి ఆపి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం కోసం నాగ్‌పూర్‌లోని మాయో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అమిత్‌కు తగిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన ప్రస్తుత సమాజంలో మానవత్వం ఎంతగా దిగజారిపోయిందో మరోసారి గుర్తుచేసింది.
Read Also : Ahmedabad Air India Plane Crash: రతన్ టాటా బ్రతికి ఉంటే మాకెప్పుడో న్యాయం జరిగేది: యూఎస్ లాయర్
नागपूर-जबलपूर राष्ट्रीय महामार्गावर माणुसकीला काळीमा फासणारी घटना, कोणीच मदतीला न आल्याने हतबल पतीने अपघातात मृत्यू झालेल्या पत्नीचा मृतदेह दुचाकीवर बांधून घेऊन जाण्याचा निर्णय, या घटनेचा व्हिडिओ सोशल मीडियावर वेगाने व्हायरल #maharashtranews #Nagpur #nagpurnews #viralvideo pic.twitter.com/TEkNiYsJV0— Harish Malusare (@harish_malusare) August 11, 2025