విజయవాడ : మానవ అక్రమ రవాణాను నియంత్రించడం పౌరుల కనీస బాధ్యతని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta) అన్నారు. పిల్లలను, బాలికలను కిడ్నాప్ చేయడం, పనివారిగా బలవంతపు వత్తిడిపై శ్రామీకులను తీసుకుని వెళ్ళడం నేరమన్నారు. ఇటువంటి అంశాలను గమనించినప్పుడు పోలీసుకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇలా సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. మానవ హక్కులు అందరికి వర్తించే దిశలో పౌరుల ఆలోచనా విధానం ఉండాలన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తన కార్యాలయంలో “మానవ అక్రమ రవాణా (Human trafficking) ఒక వ్యవస్థీకృత నేరం ” దోపిడీని అంతం చేయండిఅనే నినాదంతో కూడిన పోస్టర్ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడే వారి పట్ల ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అత్యత కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. మానవ అక్రమ రవాణా అనేది వ్యక్తుల స్వేచ్ఛను, హక్కులను, మానవతా విలువలను హరించే అతి ఘోరమైన నేరంగా పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జూలై 30వ తేదీని ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్స వంగాఖిఖి జరుపుకుంటారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ముఖ్యంగా మహిళలు, చిన్నారులు ఈ మానవ అక్రమ రవాణాకు గురవుతున్నా రన్నారు. మానవ అక్రమ రవాణా బాధితుల హక్కుల పరిరక్షణ కొరకు ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ నందు ఒక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ విభాగం వారి భద్రతే ప్రధాన అంశంగా పనిచేస్తూ, చట్టాలను కఠినంగా అమలు చేస్తూ, అక్రమ రవాణాదారులకు మరియు వారికి సహకరించే వారికి కఠిన శిక్షలు పడేలా చేయడం ద్వారా వారి నెట్వర్స్ను పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా పనిచేస్తుందన్నారు.

అంతేకాకుండా మహిళలు మరియు బాలల అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని మరియు అక్రమ రవాణా నిర్వహించే వారిని జవాబుదారీ చేయడం, అక్రమ రవాణా బాధితులకు రక్షణ మరియు నష్టపరిహారం, పునరావాసంతో పాటుగా వారికి తగన న్యాయం అందించేందుకు మనమందరం కలసికట్టుగా కృషి చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పోలీస్ యంత్రాంగానికి ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ఇటీవల గుంటూరు జిల్లా పరిధిలో పెదకాకాని పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నం. 169/2020కు సంబంధించిన మానవ అక్రమ రవాణా కేసులో ముద్దాయికి న్యాయస్థానం జీవిత ఖైదు మరియు 10 వేల రూపాయల జరిమానా విధించటం జరిగిందని తెలిపారు.
అదేవిధంగా కడప జిల్లా, ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో ఖిఖిహ్యూమన్ ట్రాఫికింగ్ అంద్ సెక్సువల్ ఎక్స్ ప్లాయిటేషన్ఫ్ఫ కేసులో ముద్దాయికి న్యాయస్థానం 7 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష మరియు 5 వేల రూపాయల జరిమానా విధించడం జరిగిందని తెలిపారు. మానవ అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని 112 నంబర్కు ఫోన్ చేయడం ద్వారా లేదా శక్తి యాప్ లో ఇల్లీగల్ యాక్టివిటీస్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా లేదా శక్తి యాప్ నంబర్ 79934 85111 డయల్ చేయడం ద్వారా తెలియాజేయల్సిందిగా కోరారు.
Read Hindi News : hindi.vaartha.com
Read also : High Court : సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై అసహనం