పాకిస్థాన్‌లోని మోడలింగ్, టెలివిజన్, సినిమా రంగాల్లో గుర్తింపు పొందిన నటి హుమైరా అస్గర్ అలీ (Humaira Asghar Ali) దారుణమైన పరిస్థితుల్లో కన్నుమూసిన విషాదకర ఘటన కలకలం రేపుతోంది. కరాచీ నగరంలో (city of Karachi) ని ఆమె నివాసమైన అపార్ట్మెంట్లో మంగళవారం విగతజీవిగా ఉన్న ఆమె శరీరాన్ని గుర్తించారు. కానీ, ఈ కేసులో మానవ భావోద్వేగాలను కలిచివేసే అంశం ఏమిటంటే — ఆమె మృతదేహం కనీసం 9 నెలల కిందటే మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతదేహం దుస్థితి
కరాచీ పోలీస్ సర్జన్ డాక్టర్ సుమయా సయ్యద్ వెల్లడించిన వివరాల ప్రకారం, హుమైరా మృతదేహం తీవ్రంగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ఆమె గత అక్టోబర్‌లోనే మరణించి ఉండవచ్చని ఆరోపిస్తున్నారు.
కాల్ రికార్డులు, సాక్ష్యాల ఆధారంగా దర్యాప్తు
డీఐజీ సయ్యద్ అసద్ రజా మాట్లాడుతూ.. కాల్ డిటైల్ రికార్డ్ (సీడీఆర్) ప్రకారం హుమైరా (Humaira Asghar Ali) చివరి కాల్ గతేడాది అక్టోబర్‌లో ఉన్నట్టు తెలిపారు. పొరుగింటి వారు కూడా ఆమెను చివరిసారి సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో చూసినట్టు చెప్పారు. కరెంటు బిల్లు చెల్లించకపోవడంతో గతేడాది అక్టోబర్‌లో అధికారులు విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. హుమైరా ఇంట్లో ఉన్న ఆహారం కూడా గడువు ముగిసిపోవడంతో ఆరు నెలల క్రితమే పాడైపోయిందని, బాటిళ్లు తుప్పుపట్టాయని మరో అధికారి తెలిపారు. ఆ అపార్ట్మెంట్లో నివసించే మిగతా వారు ఫిబ్రవరిలోనే తిరిగి రావడం, అప్పటికే మృతదేహం నుంచి వాసన రావడం (Smell coming from dead body) తగ్గిపోవడంతో ఎవరూ గుర్తించలేకపోయారు.
ఇంటి యజమాని ఫిర్యాదు… నిజం వెలుగులోకి
హుమైరా ఏడేళ్ల క్రితం లాహోర్ నుంచి కరాచీ వచ్చింది. ఆ తర్వాత అప్పుడప్పుడు మాత్రమే ఇంటికి వెళ్లేది. ఏడాదిన్నర కాలంగా ఇంటికి వెళ్లలేదు. కాగా, హుమైరా నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో దాని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
కుటుంబ సభ్యులు నిరాకరణ… అయినా సోదరుడు ముందుకొచ్చిన విషాదం
హుమైరా మరణవార్త తెలిసిన వెంటనే ఆమె కుటుంబ సభ్యులు శవాన్ని తీసుకోవడానికి మొదట నిరాకరించారు. అయితే చివరికి ఆమె సోదరుడు నవీద్ అస్గర్ కరాచీకి వచ్చి, శవాన్ని తీసుకుని వెళ్లారు. కాగా, హుమైరా మృతదేహాన్ని స్వీకరించేందుకు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. అయితే, ఆమె సోదరుడు నవీద్ అస్గర్ మాత్రం కరాచీ వచ్చి సోదరి మృతదేహాన్ని తీసుకెళ్లారు.
హుమైరా అస్గర్ అలీ ఎవరు?
లాహోర్‌కు చెందిన హుమైరా అస్గర్ అలీ 2015లో ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. టెలివిజన్ షోలైన ‘జస్ట్ మ్యారీడ్’, ‘ఎహసాన్ ఫరమోష్’, ‘గురు’, ‘చల్ దిల్ మేరే’ వంటి షోలలో సహాయ పాత్రల్లో నటించింది. అలాగే, 2015లో వచ్చిన ‘జలైబీ’, ‘లవ్ వ్యాక్సిన్’ (2021) వంటి సినిమాల్లోనూ నటించింది. 2022లో ఏఆర్వై డిజిటల్ ప్రసారం చేసిన రియాలిటీ షో ‘తమాషా ఘర్’లో పాల్గొనడం ద్వారా ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. 2023లో ‘నేషనల్ ఉమెన్ లీడర్షిప్ అవార్డ్స్’లో ‘బెస్ట్ ఎమర్జింగ్ ట్యాలెంట్ అండ్ రైజింగ్ స్టార్’ అవార్డును అందుకుంది .
హుమైరా అస్గర్ అలీ ఎవరు?
పాకిస్తానీ నటి మరియు మోడల్ హుమైరా అస్గర్ అలీ మరణించారు. అధికారులు ఆమె మృతదేహాన్ని ఆమె కరాచీ అపార్ట్మెంట్లో కనుగొన్నారు.
హుమైరా అస్ఘర్ కి ఏమైంది?
పాకిస్తానీ నటి హుమైరా అస్గర్ అలీ జూలై 8, 2025న తన కరాచీ అపార్ట్మెంట్లో మృతి చెంది కనిపించారు . పొరుగువారు దుర్వాసన వస్తుందని ఫిర్యాదు చేసిన తర్వాత 32 ఏళ్ల ఆమె కుళ్ళిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు
Read hindi news: hindi.vaartha.com
Read also: Shruti Haasan: పెళ్లి అంటే నాకు చాలా భయం