Huge drug seizure worth Rs. 1800 crore off Gujarat coast

Drug Seizure : గుజరాత్ తీరంలో రూ.1800 కోట్ల విలువైన భారీగా డ్రగ్స్ సీజ్

Drug Seizure : గాంధీనగర్ గుజరాత్ తీరంలో 300 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. 1800 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఏప్రిల్ 12, 13 తేదీలలో రాత్రులలో గుజరాత్ ATS తో కలిసి భారత తీర రక్షక దళం (ICG) చేసిన ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. ICG నౌకను గుర్తించగానే నిందితులు contraband ను విసిరి, అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దును దాటి పారిపోయారు.

Advertisements
గుజరాత్ తీరంలో రూ.1800 కోట్ల విలువైన

అనుమానాస్పద కార్యకలాపాలు

ఇటీవల ఏప్రిల్ 10న బంగాళాఖాతంలో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడంతో చేపల వేటకు వెళ్లిన ఓ పడవను భారత తీర రక్షక దళం అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) లో ICG నౌక వరాద్ పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానాస్పద కదలికలు ఉన్నట్లు గుర్తించారు. చేపల వేటకు వినియోగించే ఓడలో ఏదో లోడింగ్ జరిగిందని, అక్కడ అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని అప్రమత్తం అయ్యారు.

ఎవరి వద్ద గుర్తింపు కార్డులు లేవు

అధికారులు తక్షణం రంగంలోకి దిగి ఆ ఓడలో 50 నుండి 60 కిలోగ్రాముల బరువున్న దాదాపు 450 సంచులు తరలిస్తున్నట్లు భారత కోస్ట్ గార్డ్స్ కనుగొన్నారు. మార్కెట్ విలువ దాదాపు రూ. 1 కోటిగా ఉంటుందని అధికారిక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని Kakdwip ఫిషింగ్ హార్బర్ పేరిట ఆ బోడ్ రిజిస్టర్ అయి ఉంది. కానీ చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా పడవ నడుపుతున్నారని అధికారులు గుర్తించారు. పడవలో ఉన్న 14 మంది భారతీయులలో ఎవరి వద్ద గుర్తింపు కార్డులు లేవు.

సముద్ర జలాలకు సంబంధించిన చట్టాల ఆధారంగా చర్యలు

తాము ఐదు రోజులుగా సముద్రంలో ఉన్నట్లు సిబ్బంది చెప్పారు. కానీ పడవలో చేపలు పట్టేందుకు వినియోగించే పరికరాలు గానీ, చేపలు కూడా కనిపించలేదు. దాంతో ఆ బోటు ద్వారా డ్రగ్స్ లాంటివి అక్రమంగా సముద్రం ద్వారా విక్రయాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. భారత తీర రక్షక దళం ఆ పడవలోని సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ పడవను సీజ్ చేసి చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు చేపట్టార. విచారణ కోసం పారదీప్ పోర్టుకు తరలించినట్లు సమాచారం. సముద్ర జలాలకు సంబంధించిన చట్టాల ఆధారంగా చర్యలు చేపట్టారు.

  Read Also: మరోసారి సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు.. కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం..!
 
Related Posts
స్టాలిన్ వ్యాఖ్యలకు జై కొట్టిన కేటీఆర్
stalin , ktr

జనాభా ప్రాతిపదికన దేశంలో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ వ్యాఖ్యలను తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ Read more

Uttam : ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్త‌మ్ సమీక్ష
Uttam review

యాసంగి ధాన్యం కొనుగోళ్లు మరియు తాగునీటి సరఫరాపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో Read more

Free seats : ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత సీట్లు.. 28 నుంచి దరఖాస్తులు
AP private school Free seat

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉచిత సీట్ల కోసం దరఖాస్తుల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించబోతోంది. ప్రభుత్వం విడుదల Read more

Sunita Williams : సునీతా విలియమ్స్ జీతం ఎంతంటే?
Sunita Williams arrival delayed further

భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా (NASA) వ్యోమగామి సునీతా విలియమ్స్ కొద్ది రోజుల్లో భూమి మీదకు చేరుకోనున్నారు. అంతరిక్ష ప్రయాణాల్లో అనేక రికార్డులను నెలకొల్పిన ఆమె, Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×