భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్థాన్ (Pakistan)లో భారీ పేలుడు సంభవించింది. బలోచిస్థాన్ ప్రావిన్ (Balochistan province)లోని ఓ మార్కెట్ వద్ద బాంబు పేలింది (Bomb Blast). ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు.

పోలీసు బస్సును లక్ష్యంగా ..
ఈ ఘటన పిషిన్ జిల్లాలోని సుర్ఖబ్ చౌక్ సమీపంలోని ప్రధాన మార్కెట్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పేలుడు సమయంలో స్థానికులు, పోలీసులు, ఇతరులు అక్కడ ఉన్నారు. పోలీసు బస్సును లక్ష్యంగా చేసుకుని రిమోట్ సాయంతో ఐఈడీ (Improvised Explosive Device) పేల్చినట్లు తెలుస్తోంది. పోలీసు బస్సులో 40 మంది ఉన్నారు, అందులో నలుగురు అక్కడికక్కడే మరణించారు, మరో 16 మంది గాయపడ్డారు.
బలోచిస్థాన్‌లోని కిల్లా అబ్దుల్లా (Killa Abdullah) జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ జబ్బర్ మార్కెట్ (Jabbar Market) సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనతో అనేక దుకాణాలు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ పేలుడు ధాటికి నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు కిల్లా అబ్దుల్లా డిప్యూటీ కమిషనర్ రియాజ్ ఖాన్ తెలిపారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రియాజ్ ఖాన్ వెల్లడించారు.
ప్రభుత్వానికి వ్యతిరేక నిరసనలు
ఈ దాడికి బాధ్యత వహించిన సంస్థను ఇంకా గుర్తించలేదు. అయితే, బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) గతంలో బలూచిస్తాన్‌లో పాక్ సైనికులపై దాడులకు పాల్పడింది. ఈ సంఘటన పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలూచ్ ప్రజల నిరసనల నేపథ్యంతో జరిగింది. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఈ దాడిని ఖండించారు, చిన్న పిల్లలపై దాడి చేసే ఉగ్రవాదులను మనుషులుగా పిలిచే అర్హత లేదని అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, బాధ్యులను గుర్తించి శిక్షించాలని ఆయన కోరారు.ఈ ఘటన పాకిస్తాన్‌లో భద్రతా పరిస్థితులపై ఆందోళనలను పెంచుతోంది. బలూచిస్తాన్‌లో వేర్పాటువాద ఉద్యమాలు, ఉగ్రవాద దాడులు, ప్రభుత్వానికి వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలు పాకిస్తాన్‌లో రాజకీయ, భద్రతా పరిస్థితులపై ప్రభావం చూపిస్తున్నాయి.
Read Also : Indian Army: పాక్ క్షిపణులను ధ్వంసం చేసిన భారత ఆర్మీ..వీడియో విడుదల