Huge arms dump found in Coombings

కూంబింగుల్లో బయటపడిన భారీ ఆయుధాల డంప్‌

రాయ్‌పూర్‌: ఇటీవల భద్రతా బలగాల ఆపరేషన్లు, ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎదురుకాల్పుల్లో భారీగా క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులు.. మరోపక్క పోలీసుల కూంబింగుల్లో ఆయుధ డంప్‌లను కనుగొంటున్నారు. గత శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని మల్కన్‌గిరి జిల్లాలో ఆయుధ డంప్‌ బయటపడిన విషయం తెలిసిందే. తాజాగా సుక్మా జిల్లాలో కూడా మరో డంప్‌ను భద్రతా బలగాలు కనుగొన్నాయి. జిల్లాలోని దుల్లేడ్‌, మెట్టుగూడ అటవీ ప్రాంతంలో 203 కోబ్రా బెటాలియన్‌, సీఆర్పీఎఫ్‌ 131 బెటాలియన్‌ సిబ్బంది కూంబింగ్‌ చేపట్టాయి.

image

ఈ క్రమంలో మెట్టుగూడ గ్రామం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక గుహను కనుపెట్టారు. అందులో పరిశీలించగా 21 ఐఈడీలు, మల్టీ బ్యారెల్‌ గ్రెనేడ్‌ లాంచర్‌ (BGL), ఒక జనరేటర్‌ సెట్‌, లాత్‌ మెషిన్‌ పరికరాలు, భారీ మొత్తంలో పేలుడు తయారీ పదార్థాలు, తుపాకీ తయారీ పరికరాలు, వైద్య సామాగ్రి ఉన్నాయి. భద్రతా బలగాలు భారీ ఆయుధ డంప్‌ను స్వాధీనం చేసుకోవడంతో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగినట్లయింది.

ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దుల్లో మంగళవారం కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో చనిపోయిన 16 మంది మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. వారిలో దశాబ్దాల పాటు భద్రతా దళాలకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న మావోయిస్టు అగ్రనేత జయరాం రెడ్డి అలియాస్‌ చలపతి కూడా ఉన్నారు.

Related Posts
దసరాకి ‘గేమ్ ఛేంజర్’ టీజర్ – తమన్
game changer jpg

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కిక్కిచ్చే న్యూస్ చెప్పారు. డైరెక్టర్ శంకర్ (Shankar) - మెగా పవర్ స్టార్ రామ్ Read more

మందు బాబులకు షాక్ ఇచ్చిన బాబు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మందుబాబులకు షాక్‌ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలను 15 శాతం పెంచుతూ ఏపీ ఎక్సైజ్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం Read more

అమిత్‌షాకు ఆంధ్రలో అడుగుపెట్టే అర్హత లేదు : షర్మిల
Amit Shah is not eligible to enter Andhra.. Sharmila

అమరావతి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ట్వీట్ చేశారు. పార్లమెంట్‌లో భారతరత్న బీఆర్ Read more

కాంగ్రెస్ పరిస్థితి ఇక ‘జీరో’ నేనా..?
rahul sad

ఢిల్లీ రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడు ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కనీస స్థాయికి పడిపోయింది. 1952 నుండి 2020 మధ్య ఎనిమిది సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో Read more