Huge allocations for the Rythu Bharosa scheme

Telangana Budget : రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు

Telangana Budget: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతులకు పంట కోసం ఆర్థిక సాయం చేయడానికి బడ్జెట్ ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లను కొనుగోలు చేసేందుకు పెట్టుబడి సాయం కోసం బడ్జెట్ లో కేటాయింపులు చేసింది. రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా పథకానికిగానూ పద్దెనిమిది వేల కోట్ల (రూ.18,000 కోట్లు) రూపాయలు తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26లో కేటాయించారు.

రైతు భరోసా పథకానికి భారీగా

ఎకరానికి రూ.12 వేలకు పెంచి అమలు

రైతులకు గత ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేలు పంట పెట్టుబడి సాయం ఇచ్చేంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ.12 వేలకు పెంచి అమలు చేస్తోంది. ఖరీఫ్ సీజన్ కు రూ.6 వేలు, రబీ సీజన్లో పంట పెట్టుబడి సాయం రూ.6 వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.

ఏడాదికి ఒక్కో సాగు చేసే ఎకరానికి 12 వేలు

కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26 తేదీన 4 పథకాలను ప్రవేశపెట్టింది. రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇండ్ల పథకం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, తెలంగాణ రైతు భరోసా పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద రైతులకు రెండు విడతలుగా ఏడాదికి ఒక్కో సాగు చేసే ఎకరానికి 12 వేల రూపాయల పంట పెట్టుబడి సాయం అందుతుంది. సాగుకి యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తామని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, అవకతవకలకు అడ్డుకట్ట వేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. గ్రామ సభలలో దరఖాస్తులు తీసుకుని, సాగుకు యోగ్యంకాని భూమిని గుర్తించి ప్రజా ధనం వృధాను అరికట్టినట్లు చెప్పారు.

Related Posts
Telangana :తెలంగాణాలో మద్యం ధరలు పెంపు
Telangana :తెలంగాణాలో మద్యం ధరలు పెంపు

తెలంగాణాలో మద్యం ధరలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం, మద్యం ధరలను 10% నుంచి 15% వరకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. Read more

18న బీసీ సంఘాల నిరసనలు: ఆర్. కృష్ణయ్య
Protests of BC communities on 18th of this month..R. Krishnaiah

42% రిజర్వేషన్లకు కచ్చితంగా చట్టబద్ధత కల్పించాల్సిందే.. హైదరాబాద్‌: కులగణన సర్వే మళ్లీ జరపాలని, స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, ఆ తర్వాతే ఎన్నికలు జరపాలనే Read more

రోడ్ సేఫ్టీ వీక్: రహదారి భద్రతపై అవగాహన
road safety week

"రోడ్ సేఫ్టీ వారం" ఒక దేశవ్యాప్తంగా జరుపుకునే ప్రచార కార్యక్రమం, దీని ప్రధాన ఉద్దేశ్యం రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం. రహదారి ప్రమాదాలు, గాయాలు, మరణాలు Read more

ఇంకా బొగ్గు గ‌నిలోనే కార్మికులు..ఒక‌రి మృత‌దేహం వెలికితీత‌
workers in the coal mine..one's dead body was exhumed

న్యూఢిల్లీ: అస్సాంలోని డిమా హ‌సావోలోని బొగ్గు గ‌నిలో రెండు రోజుల క్రితం ఆ గ‌నిలోకి నీరు ప్ర‌వేశించింది. దీంతో దాంట్లో సుమారు 15 మంది కార్మికులు చిక్కుకున్న‌ట్లు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *