యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు దగ్గరపడుతుండగా, బిగ్ సర్‌ప్రైజ్ రాబోతోంది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న భారీ చిత్రం ‘వార్ 2’ నుంచి అదిరిపోయే అప్డేట్ ఉండబోతుందని తెలుస్తోంది.హృతిక్ తన ట్వీట్‌లో, “సర్‌ప్రైజ్ రెడీ ఉంది. ఊహించగలవా?” అని ఎన్టీఆర్‌ను టీజ్ చేశారు. దీనిపై వెంటనే ఎన్టీఆర్ స్పందిస్తూ, “కబీర్.. నిన్ను వేటాడేందుకు సిద్ధంగా ఉన్నా” అంటూ సరదాగా రిప్లై ఇచ్చాడు. ఈ ఫ్రెండ్లీ బాంటర్ అభిమానులను విపరీతంగా ఎంటర్‌టైన్ చేసింది.

వార్ 2 అప్‌డేట్ కోసం వెయిటింగ్ జోరు
ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటిస్తున్న ‘వార్ 2’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్, పాన్ ఇండియా లెవెల్‌లో వస్తోంది. కథానాయికగా కియారా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.సినీ వర్గాల సమాచారం మేరకు, మే 20న టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ అప్డేట్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. ‘వార్’ ఫస్ట్ పార్ట్‌లో హృతిక్, టైగర్ ష్రాఫ్ కలసి చేసిన యాక్షన్ విజయం తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్‌లో ఎన్టీఆర్ అడుగుపెడుతున్నాడు అంటే అంచనాలు మామూలుగా లేవు.
ఎన్టీఆర్ రా ఏజెంట్‌గా?
బాలీవుడ్ బజ్ ప్రకారం, ఎన్టీఆర్ ఈ సినిమాలో రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. అగ్రగామి యాక్షన్ సన్నివేశాల్లో ఎన్టీఆర్ స్టైల్‌లో మాస్ ఫైట్స్ ఉండే అవకాశం ఉంది. ఫ్యాన్స్‌కు ఇది అసలు మాస్ ఫెస్టివల్‌గా మారనుంది.వార్ 2 చిత్ర బృందం ఈ సినిమాను ఆగస్టు 14, 2025న విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇండిపెండెన్స్ డే వీక్‌లో రిలీజ్ కావడం సినిమాకి అదనపు బలాన్ని తీసుకువస్తుంది.
మే 20 నాడు ఫ్యాన్స్‌కు ఫుల్ మాస్ ట్రీట్?
ఇప్పుడు అందరి దృష్టి మే 20పైనే ఉంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలయ్యే వార్ 2 గ్లింప్స్ లేదా టీజర్ అభిమానులకు ఫుల్ ప్యాకేజ్ ట్రీట్ కానుంది. హృతిక్, ఎన్టీఆర్ కలయిక ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి!
Read Also : Kannappa: జూన్ 27న వరల్డ్ వైజ్ గా ‘కన్నప్ప’ రిలీజ్