హైదరాబాద్(Hyderabad) నగరానికి గర్వకారణంగా మారిన మిస్ వరల్డ్-2025 పోటీలు (Miss World 2025) చివరి దశకు చేరుకున్నాయి. ఈ నెల 31న హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల నుంచి వచ్చిన అందగత్తెలు ఈ పోటీలో పాల్గొంటున్నారు. ఈ గొప్ప ఈవెంట్‌ను హైదరాబాద్ విజయవంతంగా హోస్ట్ చేస్తుండటంతో దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించి నగరమంతా వేడుకల మూడ్‌లోకి వెళ్లిపోయింది.
మిస్ వరల్డ్ టైటిల్ ప్రైజ్ మనీ
మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన వ్యక్తికి లభించే గౌరవం తో పాటు దక్కే ప్రైజ్ మనీ కూడా ఎంతో గొప్పది. విజేతకు ప్రపంచ సుందరి కిరీటంతో పాటు $1 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.8.5 కోట్లు) ప్రైజ్ మనీగా ఇవ్వనున్నారు. ఈ ప్రైజ్ మనీ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ మరియు ప్రధాన స్పాన్సర్ల ద్వారా అందించబడుతుంది. ఇదే కాకుండా, విజేతకు స్పాన్సర్స్ నుండి ప్రత్యేక బహుమతులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ పురస్కారాలు కూడా అందనున్నట్లు తెలుస్తోంది.
సినీ అవకాశాలు, మోడలింగ్ కాంట్రాక్టులు ఛాన్స్
ఇవే కాకుండా, మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకోవడం ద్వారా ఆ విజేతకు అంతర్జాతీయ గుర్తింపు లభించి, అనేక బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, సినీ అవకాశాలు, మోడలింగ్ కాంట్రాక్టులు లభించే అవకాశాలు కలుగుతాయి. గతంలో మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన భారతీయులు , ఆశా భోస్లే, ప్రియాంకా చోప్రా, మానుషీ చిల్లర్ వంటి వారు తమ కెరీర్‌లో అద్భుతమైన మార్గం ఏర్పరుచుకున్నారు. అందువల్ల మిస్ వరల్డ్ విజేతకు ఇది కేవలం కిరీటం మాత్రమే కాకుండా, లక్షలాది రూపాయల సంపాదనకు ద్వారం కూడా అవుతుంది.
Read Also : Narendra Modi : ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్రం