ఇరాన్-ఇజ్రాయెల్ (Iran-Israel War)మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాల మిలిటరీ సామర్థ్యం పై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఎయిర్‌ఫోర్స్ (Air Force) పరంగా ఏ దేశం వద్ద ఎన్ని మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి అనే అంశంపై సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులోని వివరాల ప్రకారం, అమెరికా అత్యధికంగా 14,486 మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. దాదాపు అన్ని ఖండాల్లోనూ సైనిక స్థావరాలు కలిగి ఉండటమే దీనికి కారణం.
భారత్‌కు 4వ స్థానం, ఇజ్రాయెల్ 18వ స్థానం
ఇక భారత్ ఈ జాబితాలో 2,296 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో 4వ స్థానంలో నిలిచింది. భారత ఎయిర్ ఫోర్స్ శక్తిని నిరంతరం పెంచే క్రమంలో దేశీయంగా తయారు చేసిన టేజస్ వంటి యుద్ధ విమానాలు, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఫైటర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ 612 మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో 18వ స్థానంలో ఉంది. వరుసగా శత్రు దేశాలతో ఉన్న పొరుగు సంబంధాల కారణంగా ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్ కు విశేష ప్రాధాన్యం ఉంది.
ఇరాన్ చివరి స్థానంలో.. భవిష్యత్తులో మార్పులేనా?
ఇక ఇరాన్ జాబితాలో 551 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో 21వ స్థానంలో నిలిచింది. పలు ఆంక్షల కారణంగా ఆయుధ సాధనాల్లో అభివృద్ధి నెమ్మదిగా సాగుతోంది. అయినప్పటికీ, స్థానికంగా డ్రోన్లు, మిస్సైల్ టెక్నాలజీలో పెద్ద పాయిగా ఎదుగుతోంది. అంతేకాదు, మిలిటరీ సామర్థ్యం కేవలం ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య మీద ఆధారపడి ఉండదని, టెక్నాలజీ, స్ట్రాటజీ కూడా కీలకమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినా, ఈ లెక్కలు దేశాల భద్రతా దృక్పథాన్ని అర్థం చేసుకోవడంలో ఉపయోగపడతాయనే చెప్పాలి.
Read Also : Akhilesh : కూటమి పనిచేస్తోంది – ఒకే లక్ష్యం ఉంది : అఖిలేష్ యాదవ్