భారతీయ రైల్వేలు దేశం కోసం ఎంతో కీలకమైన వ్యవస్థ. ప్రతి బడ్జెట్‌లో కూడా రైల్వే కోసం పెద్ద ప్రకటనలు వచ్చే ఆశ ఉండేది. కానీ ఈసారి పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపించింది. రైల్వే బడ్జెట్‌లో ప్రభుత్వం పెద్దపెద్ద ప్రకటనలు చేయలేదు. అయితే, ఎక్కడో ఒకసారి కేటాయింపులు, ప్రాధాన్యాలపై మరింత దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది.2025 ఆర్థిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారంనాడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇది 8వసారి ఆమె కేంద్ర బడ్జెట్‌ను ప్రస్తావించారు. అయితే, రైల్వే బడ్జెట్‌కు సంబంధించి పెద్ద ఎలాంటి నూతన ప్రకటనలు చేయలేదు. రైల్వే శాఖకు సంబంధించి గతేడాదితో పోల్చితే ఈసారి కూడా రూ.2,65,200 కోట్లు కేటాయించడమే.ఈసారి, భద్రత, ఎలక్ట్రిఫికేషన్, నూతన రైల్వే లైన్లు మరియు ఇతర అభివృద్ధి చర్యలు ప్రాధాన్యముగా ఉన్నాయి.
ముఖ్యంగా, 66,000 కోట్లు పెన్షన్ ఫండ్‌కు కేటాయించబడగా, కొత్త రైల్వే లైన్ల నిర్మాణం కోసం రూ.32,235 కోట్లు, లైన్ల డబ్లింగ్ కోసం రూ.32,000 కోట్లు, మరియు గేజ్ మార్పులకు రూ.4,550 కోట్లు కేటాయించబడ్డాయి. విద్యుత్ వ్యవస్థకు రూ.6,150 కోట్లు, రైల్వే సిబ్బంది సంక్షేమం కోసం రూ.833 కోట్లు మరియు శిక్షణ కోసం రూ.301 కోట్లు కేటాయించారు. అదనంగా, రైల్వే సేఫ్టీ ఫండ్ కోసం రూ.45,000 కోట్లు ప్రకటించబడినవి.ప్రయాణీకుల ప్రయోజనాల కోసం కొత్త నిర్ణయాలు కూడా ఉన్నాయి. 17,500 నాన్-ఏసీ, స్లీపర్ కోచ్‌లు కొత్తగా నిర్మించడానికి కేటాయించబడినట్లు బడ్జెట్‌లో పేర్కొనబడింది.
మరొక ముఖ్యమైన అంశం కవచ్ సాంకేతికతపై కేంద్రం తీసుకుంటున్న చర్యలు. రైల్వే ప్రమాదాలను తగ్గించేందుకు కవచ్ కొత్త వెర్షన్ 4.0ను దేశంలోని ప్రధాన మార్గాల్లో అమలు చేయనున్నారు. ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-కోల్‌కతా మార్గాలు అతి రద్దీగా ఉండడంతో వీటిలో కవచ్‌ను అధికంగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ముంబై-చెన్నై, చెన్నై-కోల్‌కతా మార్గాల్లో కూడా కవచ్ అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇలా, రైల్వే శాఖకు కేటాయింపులు పెరిగినప్పటికీ, మరింత ఆర్థిక మద్దతు అవసరమని అనిపిస్తుంది. గత బడ్జెట్‌తో పోల్చితే కేటాయింపులు 20% పెరిగే అవకాశం ఉన్నా, కేంద్రం ఇంకా నేటివి ఫండ్స్‌ను తగ్గించి, గడచిన ప్రకటనలను మాత్రమే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.