విజయవాడ : పేదలు బలహీనవర్గాల ఇళ్ళ నిర్మాణం కోసం విశాఖ పట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో భూ సమీకరణ పథకాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ నిర్ణయించింది. మూడు జిల్లాల్లో మొత్తం 1941.19 ఎకరాలు సమీకరించ నున్నారు. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్కుమార్ బుధవారం (Wednesday) ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) పరిధిలో భూ సమీకరణ కోసం విశాఖ కలెక్టర్ చైర్మన్గా ప్రభుత్వం నియమించిన కమిటీ ఇటీవల నివేదిక ఇచ్చింది. విజయనగరం, అనకాపల్లిలో ఆయా జిల్లాల ఆర్టీఓలు అధికారాలు కల్పించారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలో గిడిజాల, శొంఠ్యాం, బీడీపాలెం, పద్మనాభం మండలం కొవ్వాడలో మొత్తం 1,132.90 ఎకరాలు విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలస, భోగాపురం మండలం రావాడలో 23.41 ఎకరాలు, అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో అంత కాపల్లి, బాటతజం గాలపాలెం, ఎ. శిరసవల్లి, నల్లరేగుడుపాలెం, పైడివాడ అగ్రహారం, అనకాపల్లి మండలం తగరంపూడిలో మొత్తం 783.69 ఎకరాలుభూ సమీకరణ పథకంలో సేకరించిన భూములు అభివృద్ధి చేశాక ఎసైన్డ్ భూములపై ఎకరాకు 900 చదరపు గజాల ప్లాట్ కేటాయిస్తారు. పదేళ్ళకు పైగా ఆక్రమణలో ఉన్న భూములపై ఎకరాకు 450 చదరపు గజాల ప్లాట్ ఇస్తారు. విశాఖపట్నం, అనకాపల్లి, విజయ నగరం జిల్లాల్లోని ఆరు మండలాల్లో అందుబాటులో ఉన్న భూముల వివరాలను నివేదికలో పేర్కొంది.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Law and Order: జగన్ ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతల పరిస్థితికి భంగం కలిగిస్తున్నారు