ఇక అందమైన క్లాసిక్ లుక్, శక్తివంతమైన ఇంజిన్, ఆధునిక టెక్నాలజీతో 2025 హోండా సీబీ350 సిరీస్ మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి. ‘సీబీ350 హెచ్’నెస్’, ‘సీబీ350’, ‘సీబీ350 ఆర్‌ఎస్’ వేరియంట్లుగా ఈ కొత్త బైకులు లభించనున్నాయి. రైడింగ్ ప్రెఫరెన్స్ ఆధారంగా వినియోగదారులకు విభిన్నమైన ఎంపికలు ఇవ్వడమే లక్ష్యంగా హోండా ఈ మోడళ్లను విడుదల చేసింది. ధరల పరంగా కూడా ఈ బైకులు మధ్యస్థ తరగతి రైడర్స్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించబడినట్లు తెలుస్తోంది. ధరలు రూ.2.10 లక్షల నుంచి ప్రారంభమై రూ.2.19 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.

పవర్‌ట్రెయిన్‌లో నూతనత
ఈ మోడళ్లలో ప్రధానమైన ‘సీబీ 350’ మోడల్‌లో 348.36cc ఎయిర్ కూల్డ్, ఫోర్ స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అమర్చారు. ఇది ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న OBD-2B మరియు E20 ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడింది. దాంతోపాటు, 5 స్పీడ్ గేర్‌బాక్స్ సౌకర్యం కూడా ఈ బైకులన్నింటిలో ఉంది. అద్భుతమైన ట్యూనింగ్, మెరుగైన మైలేజ్, క్లాసిక్ ఎగ్జాస్ట్ నోట్లతో ఈ మోడళ్లు రైడింగ్‌కు మరింత ఆసక్తి కలిగిస్తాయి. శక్తి, టార్క్, డిజైన్ లో ప్రత్యేకత అన్ని వేరియంట్లు లాంగ్ రైడ్‌లకు అనువైన క్రూజింగ్ గేర్‌సెట్‌తో రూపొందించబడ్డాయి. CB350 హెచ్’నెస్ మరియు CB350 ఆర్‌ఎస్ మోడళ్లలో 20.7 బీహెచ్‌పీ పవర్, 30 ఎన్ఎం టార్క్ ఉంది. CB350 వేరియంట్ మాత్రం 29.5 ఎన్ఎం టార్క్‌ను అందించటం ప్రత్యేకత. అన్ని మోడళ్లు క్రూజింగ్ కోసం సులభమైన 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తున్నాయి. బైకుల అందాన్ని పెంచేలా ఆకర్షణీయమైన షేడ్స్‌ను ప్రవేశపెట్టారు.పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ మార్షల్ గ్రీన్ మెటాలిక్, మ్యాట్ డ్యూన్ బ్రౌన్, ప్రీషియస్ రెడ్ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, డీఎల్ఎక్స్ ప్రో వేరియంట్లు చిక్ క్రోమ్ యాక్సెంట్‌లతో, ప్రత్యేక రంగు సీట్లతో మరింత స్టైలిష్‌గా ఉన్నాయి. ఇవి రూ. 2.15 లక్షల నుంచి రూ. 2.19 లక్షలు (ఎక్స్ షోరూం, ఢిల్లీ) గా ఉన్నాయి. డీఎల్ఎక్స్ క్రోమ్ అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్ వంటి రంగుల్లో స్టైల్‌ను ఎలివేట్ చేస్తుంది. ధరలు రూ. 2.10 లక్షల నుంచి ప్రారంభమై రూ. 2.15 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి. 2025 హోండా సీబీ 350ఆర్ఎస్
2025 సీబీ 350ఆర్ఎస్.. డీఎల్ఎక్స్, డీఎల్ఎక్స్ ప్రొ ట్రిమ్‌లలో వస్తోంది. డీఎల్ఎక్స్ వేరియంట్ పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్‌తో సరికొత్తగా ఉంది. డీఎల్ఎక్స్ ప్రో రెబెల్ రెడ్ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ ఆప్షన్సతో వస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 2.15 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ. 2.19 లక్షల వరకు (ఎక్స్ షోరూం) ఉంది. హోండా సీబీ350 సిరీస్ మోడళ్లు కొత్త జనరేషన్ రైడర్స్‌కి రిట్రో లుక్‌తో పాటు ఆధునిక ఫీచర్లు, మెరుగైన రైడింగ్ అనుభవాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి.