ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రెండో శనివారం సెలవుగా ఉండే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు, ఈ నెల 12న సెలవు ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారికంగా మెమోను జారీ చేసింది. ఏప్రిల్ 12 (శనివారం)న ఆఫీసులు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పని చేయనున్నాయని స్పష్టం చేసింది.
రిజిస్ట్రేషన్లపై ప్రజల నుంచి భారీ స్పందన
ప్రస్తుతం రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లపై ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తున్న నేపథ్యంలో, ఎక్కువగా వర్కింగ్ డేస్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హాలిడేలు, వీకెండ్ సమయంలో అత్యవసర రిజిస్ట్రేషన్ల కోసం రూ.5వేలు చెల్లించి సేవలు పొందే వెసులుబాటు కూడా ఉంది. అయితే రేపు శనివారం మాత్రం ఆ రుసుము లేకుండానే సేవలు అందించనుంది.

ప్రజలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం
ఇది ప్రజలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయంగా ప్రభుత్వం పేర్కొంది. ఎక్కువమంది తమ రిజిస్ట్రేషన్ పనులను పూర్తి చేసుకోవడాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. తద్వారా ప్రజల సౌకర్యార్థం సెలవును రద్దు చేసి, పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు కార్యాలయాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.