Hindupuram Municipality won by TDP

హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసం..

అమరావతి: హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీ విజయం సాధించింది. 40 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో 23 మంది మద్దతుతో ఆరో వార్డు కౌన్సిలర్‌ రమేశ్‌ మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఓటింగ్‌లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి పాల్గొన్నారు. వైసీపీ అభ్యర్థి లక్ష్మి 14 ఓట్లతో ఓడిపోయారు. ముగ్గురు సభ్యులు గైర్హాజరయ్యారు. ఏలూరులో, రెండు డిప్యూటీ మేయర్‌ స్థానాలు కూడా టీడీపీ ఖాతాలో చేరాయి.

Advertisements

ఉమామహేశ్వరరావు మొదటి డిప్యూటీ మేయర్‌గా, దుర్గాభవాని రెండో డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరు డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో టీడీపీ మద్దతు అభ్యర్థి తహసీన్‌ 29 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆమెకు 41 ఓట్లు, వైసీపీ అభ్యర్థి కరీముల్లాకు 12 ఓట్లు లభించాయి. అయితే కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. పార్టీ మారిన కౌన్సిలర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోటీగా జై బాలయ్య అంటూ టీడీపీ కౌన్సిలర్ల నినాదాలు చేశారు.

image

హిందూపుర్‌ మున్సిపాలిటీ చైర్మన్ మొదటి నుంచి ఉత్కంఠ రేపింది. టీడీపీ నుంచి రమేష్, వైసీపీ నుంచి లక్ష్మి పోటీలో ఉన్నారు. చివరకు రమేష్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నారు. అయితే హిందూపురం మున్సిపాలిటీలో క్యాంప్‌ పాలిటిక్స్‌ కాక రేపాయి. వైసీపీ నుంచి గెలిచి చైర్‌పర్సన్‌ అయిన ఇంద్రజ.. రాజీనామా చేసి టీడీపీలో చేరడంతో చైర్మన్‌ పీఠం ఖాళీ అయింది. ఫిబ్రవరి 3న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుండడంతో టీడీపీ అలెర్ట్‌ అయింది. 20మంది కౌన్సిలర్లను బెంగళూరు క్యాంపునకు తరలించడంతో హిందూపురం రాజకీయాలు వేడెక్కాయి.

Related Posts
YCP: వైసీపీ లక్ష్యంగా కూటమి వేగంగా అడుగులు
వైసీపీ లక్ష్యంగా కూటమి వేగంగా అడుగులు

ఏపీ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చాయి. అయితే, మొత్తం ఫలితాలను పరిశీలిస్తే, Read more

తణుకు మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు మృతి
తణుకు మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. టీడీపీ తణుకు మాజీ ఎమ్మెల్యే చిట్టూరి వెంకటేశ్వరరావు (86) కన్నుమూశారు.కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో Read more

Purandeswari: పవన్ కు పురందేశ్వరి శుభాకాంక్షలు
Purandeswari పవన్ కు పురందేశ్వరి శుభాకాంక్షలు

Purandeswari: పవన్ కు పురందేశ్వరి శుభాకాంక్షలు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజకీయ వర్గాల నుండి శుభాకాంక్షల వెల్లువ ఊహించదగినదే. కూటమి పార్టీల నేతలు, Read more

గాజా-ఇజ్రాయెల్ చర్చల మధ్య 70 మరణాలు
గాజా ఇజ్రాయెల్ చర్చల మధ్య 70 మరణాలు

గాజాలో ఇజ్రాయెల్ సైనిక దాడులు కారణంగా శనివారం 70 మంది మరణించినట్లు పాలస్తీనా వైద్యులు తెలిపారు. ఈ కాల్పులు, 15 నెలల యుద్ధాన్ని ముగించేందుకు మధ్యవర్తులు విరమణ Read more

×