ఎప్పుడో కనుమరుగైందనుకున్న ఓ అరుదైన వన్యజీవి మళ్లీ కనబడింది హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి జిల్లాలో ఎగిరే ఉడుత (Flying Squirrel) ను అటవీ శాఖ అధికారులు గుర్తించారు.మియార్ లోయలో కెమెరా ట్రాపింగ్ ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. దీనిని యూపెటౌరస్ సినేరియస్ అని శాస్త్రీయంగా పిలుస్తారు.మొత్తంగా ఇది ఒక మంచి జీవవైవిధ్య ఆవిష్కరణగా భావిస్తున్నారు.ఈ ఉడుతను గతంగా చివరిసారి 1994లో చూసినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అప్పటి తర్వాత ఇది కనిపించకపోవడంతో ఇది అంతరించిపోయిందన్న అభిప్రాయం నెలకొంది.కానీ 2023 అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య జరిగిన కెమెరా ట్రాపింగ్ సర్వేలో ఇది మళ్లీ కనిపించింది.ఈ వీడియోలు, ఫోటోలు చూస్తుంటే జీవశాస్త్రవేత్తల హర్షం వ్యక్తమవుతోంది.

హిమాలయ ప్రాంతాల్లో అద్భుత అన్వేషణ
వాయవ్య హిమాలయాల్లో 62 కెమెరా ట్రాప్స్ అమర్చారు.వాటిలో ఎగిరే ఉడుతతో పాటు, మంచు చిరుతపులి, ఎర్ర నక్క, హిమాలయ తోడేలు, కొండ ముంగిస వంటి అరుదైన జంతువులూ కనిపించాయి.ఇవన్నీ మియార్ లోయలోని రాతిబండ ప్రాంతాల్లో కనిపించాయి. అక్కడి వాతావరణం ఈ జంతువుల జీవనానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.

SPAI ప్రాజెక్టు ఫలితంగా వెలుగులోకి వచ్చిన ఉడుత
ఇది Snow Leopard Population Assessment in India (SPAI) ప్రాజెక్టు భాగంగా అమర్చిన కెమెరాల వల్ల వెలుగులోకి వచ్చింది.ఈ పరిశోధనకు హిమాచల్ అటవీ శాఖతో పాటు నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ (NCF) సహకరించింది.కిబ్బర్ గ్రామానికి చెందిన స్థానిక యువకులు 2010 నుంచే ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ ఉడుత కనిపించడం వన్యప్రాణుల సంరక్షణ రంగానికి పెద్ద ప్రోత్సాహంగా మారింది. దీనివల్ల మియార్ లోయ జీవవైవిధ్యం ఎంత విలువైనదో మరోసారి తెలిసింది.శాస్త్రవేత్తలు పర్యావరణవేత్తలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మరిన్ని రకాల వన్యప్రాణులను గుర్తించే పనిలో ఉన్నారు.
READ ALSO : P4 : P4 – ప్రపంచంలోనే ప్రత్యేకమైన కార్యక్రమం : చంద్రబాబు