The Hen and the Kite’s Feud:చాలా కాలం కిందట కోడి, గద్ద ఎంతో స్నేహంగా జీవించేవి. ఒకరోజు గద్ద వాళ్ళ అమ్మగారి ఇంటికి పోతూ తన ఇంటి తాళం చెవిని కోడికి ఇచ్చి “ఈ తాళంచెవి జాగ్రత్తగా చూస్తూ ఉండు, నేను మా అమ్మ గారి ఇంటికి వెళ్లి నెలలోపు వస్తా” అని చెప్పి వెళ్లిపోయింది.

ఆ రోజు నుండి కోడి ఆ తాళం చెవిని(key) ఎంతో భద్రంగా తన రెక్కల్లో దాచుకుంది. అది అటూ ఇటూ తిరిగేటప్పుడు తాళంచెవి కాస్త ఎక్కడో పడిపోయింది. ఈ లోగా గద్ద వచ్చి “నా తాళంచెవి ఇవ్వమని అడిగింది. కోడి తన రెక్కలను( wings)
దులిపి చూడగా కనిపించలేదు. “ఎక్కడో జారి పడిపోయింది” అని చెప్పింది.
గద్ద “తాళం చెవిని వెతికే వరకు నీ పిల్లల్ని తింటూనే ఉంటాను” అని శపిస్తూ తిట్టింది. ఇక అప్పటి నుండి కోడికి గద్దకు వైరం పుట్టింది. గద్ద కోడి పిల్లల్ని తన్నుకెళ్లడం, కోడి ఎదిరించడం ఆనాటి నుండి ఆనవాయితీగా వస్తోంది.

కోడి తనతో పాటు తన పిల్లలను కూడా తాళం చెవిని వెతకమని చెప్పడంతో కోళ్ల జాతి మొత్తం కనిపించిన ప్రాంతమంతా ముక్కుతో కాళ్లతో గెలకడం, తాళం చెవి కోసం వెదకడం మనం చూస్తున్నదే!
read also: hindi.vaartha.com
read also: Listen to your mother:అమ్మ మాట వినాలి