हिन्दी | Epaper

Heavy Rain : ఇవాళ రాత్రి భారీ నుంచి అతిభారీ వర్షం

Sudheer
Heavy Rain : ఇవాళ రాత్రి భారీ నుంచి అతిభారీ వర్షం

హైదరాబాద్ నగరంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి వర్షం (Rain) తన ప్రతాపాన్ని చూపుతోంది. కుండపోత వర్షంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మైండ్ స్పేస్, ఐకియా, మాదాపూర్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో వాహనాలు కదలకుండా నిలిచిపోయాయి. వర్షం వలన రోడ్లు జలమయమయ్యాయి. డ్రైనేజ్ వ్యవస్థలు విఫలమవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రాత్రికి ఇంకా అధిక వర్ష సూచన

ఇదిలా ఉండగా, వాతావరణ శాఖ (Department of Meteorology) మరో హెచ్చరిక జారీ చేసింది. రాత్రి వేళ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ నేపథ్యంలో ‘ఆరెంజ్ అలర్ట్’ జారీచేసింది. ప్రజలు అత్యవసర పనులు తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించింది. నీటిలో చిక్కుకుపోయే ప్రాంతాలకు ముందస్తుగా అజాగ్రత్త ఉండాలని, అధికారులు వాహనదారులకు సూచిస్తున్నారు.

వాహనదారులకు నరకయాతన, ప్రధాన రహదారులపై భారీ రద్దీ

వర్షంతో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. జూబ్లీ చెక్‌పోస్ట్, PVNR ఎక్స్‌ప్రెస్‌వే, జేబీఎస్, తిరుమలగిరి, లక్షీకపూల్ వంటి ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరిగింది. ట్రాఫిక్ పోలీసులు నానా తంటాలతో వాహనాలని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. వర్షం తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాతనగరంలో నివసించే వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read Also : Rain : GHMC ని అప్రమత్తం చేసిన సీఎం రేవంత్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: ప్రతిమా సింగ్

ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: ప్రతిమా సింగ్

పోలీస్ శాఖ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

పోలీస్ శాఖ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో సారా దుకాణాలు తెరవాలి – ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

తెలంగాణలో సారా దుకాణాలు తెరవాలి – ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

గచ్చిబౌలి స్టేడియం పునర్నిర్మాణం- సీఎం రేవంత్ ఆదేశం

గచ్చిబౌలి స్టేడియం పునర్నిర్మాణం- సీఎం రేవంత్ ఆదేశం

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

కేసీఆర్, కేటీఆర్‌‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

కేసీఆర్, కేటీఆర్‌‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

తెలంగాణలో వడదెబ్బ మరణాలకు ₹4 లక్షల పరిహారం!

తెలంగాణలో వడదెబ్బ మరణాలకు ₹4 లక్షల పరిహారం!

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

📢 For Advertisement Booking: 98481 12870