తెలుగు రాష్ట్రాల్లో వానలు (Rains in Telugu states) ఆగేలా లేవు. హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం కురిసి జనాలను ఇబ్బందులకు గురిచేసింది. రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోయాయి.కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎల్బీనగర్, హయత్‌నగర్, కోఠి వంటి ప్రాంతాల్లో ముంచెత్తిన వర్షం ప్రజలకు చుక్కలు చూపించింది. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్‌కు అడ్డంకి ఏర్పడింది.ఎడతెరిపిలేని వానల వల్ల హుస్సేనీ ఆలయం దగ్గర ఓ పురాతన భవనం కూలిపోయింది. 114 ఏళ్ల నాటి భవనం కూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదు.

హైదరాబాద్ మణికొండ, కోకాపేట ప్రాంతాల్లో వర్షం మరింత ఎక్కువ
ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కాకుండా భారీ వర్షం (Rain) కురిసింది. మాన్సూన్ బృందాలు అప్రమత్తమయ్యాయి. డ్రైనేజ్ క్లీన్ చేయడం, వరద నీరు తొలగించే పనులు చేస్తున్నారు.బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో రాబోయే నాలుగు రోజుల్లో వర్షాలు ముమ్మరమవుతాయని IMD తెలిపింది. మంగళవారం నుంచి 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
ఏపీలో ఆరెంజ్ అలర్ట్ – వానలు మింగేసిన జన జీవనం
ఏపీ (AP) లో పల్నాడు, గుంటూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి.నందికొట్కూరు మారుతి నగర్, హాజీ నగర్‌లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. ప్రజలు ఇంట్లో నీటితో ఇబ్బందులు పడుతున్నారు. మిడుతూరు మండలంలోని జలకనూరు చెరువు గండి పడి పొలాలు మునిగిపోయాయి.
వాగులు పొంగి ప్రవహిస్తున్న వలగొండ, బనగానపల్లె ప్రాంతాలు
అత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని పాములపాడు, కొత్తపల్లి, వెలుగోడు గ్రామాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వీపనగన్న, రేగడగూడురు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.చింతపల్లిలో భారీ వర్షాల ప్రభావంతో కొండచరియలు జారే అవకాశముంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Read Also : KTR : అప్పులపై రేవంత్ చెబుతున్నవన్నీ అబద్ధాలే: కేటీఆర్