హృదయపూర్వక శుభాకాంక్షలు పవన్‌ కళ్యాణ్ అన్న: లోకేశ్

Lokesh : హృదయపూర్వక శుభాకాంక్షలు పవన్‌ కళ్యాణ్ అన్న: లోకేశ్

Lokesh : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మంత్రి నారా లోకేశ్‌ ట్వీట్ చేశారు చేశారు . ఇందులో పవన్ పిడికిలి బిగించిన పోటోను జత చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లోకేశ్ స్పెషల్ గా విషెస్ తెలిపారు. ఇందులో పలు కీలక విషయాలను ఆయన ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ అన్నకు, నాయకులు, కార్మికులు, అనుచరులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ లోకేశ్ ట్వీట్ లో రాశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సామాజిక వృద్ధికి జనసేన కృషి అభినందనీయం అని..వారి నిబద్ధత నిజంగా ప్రశంసనీయం అన్నారు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమాన్ని నడిపించడంలో వారి పాత్ర నిస్సందేహంగా అందరికీ ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందని లోకేశ్ ట్వీట్ చేశారు.

Advertisements

జనసేన 100 శాతం విజయంతో చరిత్ర

ఈరోజు పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు భారీ ఎత్తున నిర్వహిస్తోంది. గత ఎన్నికల్లో జనసేన 100 శాతం విజయంతో చరిత్ర సృష్టించింది. అందుకే ఇప్పుడు ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. ఇందులో సాధించిన విజయాలు స్మరించుకుందాం..భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసుకుందాం అని జనసేన అధినేత పవన్ జనసైనికులకు పిలుపునిచ్చారు. పిఠాపురంలో సభలో పవన్ కల్యాణ్ 90 నిమిషాల పాటూ ప్రసంగించనున్నారని తెలుస్తోంది.

Related Posts
మీము అధికారంలోకి రాగానే టీడీపీ భరతం పడతాం – పెద్దిరెడ్డి
Peddireddy fire on Chandrab

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. త్వరలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన Read more

నవంబర్ 26న పార్లమెంట్ ఉభయసభల ప్రత్యేక సమావేశం
A special meeting of both houses of Parliament on November 26

న్యూఢిల్లీ: నవంబర్‌ 26న పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేక సమావేశానికి సిద్ధమవుతున్నాయి. రాజ్యాంగానికి ఆమోదం ఇచ్చిన సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో నవంబర్ 26న ఈ Read more

TGPSC : తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు తొలగిన అడ్డంకి
Obstacle removed for Telangana Group 1 recruitments

TGPSC : తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీవో 29 చెల్లుబాటును సవాల్​ చేస్తూ గ్రూప్​-1 అభ్యర్థులు Read more

సోనూసూద్ మంచి మనసు.. చిన్నారికి ఉచితంగా హార్ట్ ఆపరేషన్
sonuhelps

సినీ నటుడు సోనూసూద్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. ఖమ్మం (D) చెన్నూరుకి చెందిన నిరుపేదలు కృష్ణ, బిందుప్రియల మూడేళ్ల కూతురికి ఉచితంగా ముంబైలో హార్ట్ ఆపరేషన్ Read more

×