Lokesh : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు చేశారు . ఇందులో పవన్ పిడికిలి బిగించిన పోటోను జత చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లోకేశ్ స్పెషల్ గా విషెస్ తెలిపారు. ఇందులో పలు కీలక విషయాలను ఆయన ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ అన్నకు, నాయకులు, కార్మికులు, అనుచరులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ లోకేశ్ ట్వీట్ లో రాశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సామాజిక వృద్ధికి జనసేన కృషి అభినందనీయం అని..వారి నిబద్ధత నిజంగా ప్రశంసనీయం అన్నారు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమాన్ని నడిపించడంలో వారి పాత్ర నిస్సందేహంగా అందరికీ ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందని లోకేశ్ ట్వీట్ చేశారు.
జనసేన 100 శాతం విజయంతో చరిత్ర
ఈరోజు పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు భారీ ఎత్తున నిర్వహిస్తోంది. గత ఎన్నికల్లో జనసేన 100 శాతం విజయంతో చరిత్ర సృష్టించింది. అందుకే ఇప్పుడు ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. ఇందులో సాధించిన విజయాలు స్మరించుకుందాం..భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసుకుందాం అని జనసేన అధినేత పవన్ జనసైనికులకు పిలుపునిచ్చారు. పిఠాపురంలో సభలో పవన్ కల్యాణ్ 90 నిమిషాల పాటూ ప్రసంగించనున్నారని తెలుస్తోంది.