2023లో హైదరాబాద్‌లో కేవలం 40 వీగన్(Vegan Diet) రెస్టారెంట్లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 180 దాటింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో సుమారు 70 శాతం రెస్టారెంట్లు ప్రత్యేక వీగన్ మెనూను అందిస్తున్నాయి. హైదరాబాది స్టైల్‌లో వీగన్ హలీమ్, జాక్‌ఫ్రూట్ బిర్యానీ, సోయా హలీమ్, ప్లాంట్ బేస్డ్ పిజ్జా, వీగన్ ఇడ్లీ, దోస, షవర్మా వంటి వంటకాలు ఫుడ్ లవర్స్‌ను ఆకర్షిస్తున్నాయి.
read also: Food Poison: గద్వాల జిల్లాలో కలకలం – 50 మంది విద్యార్థులకు అస్వస్థత

శాకాహారంలో ప్రోటీన్ మూలాలు
జంతు ఉత్పత్తులను నిరాకరించే వారు ప్రోటీన్(Protein) కోసం మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎంచుకుంటున్నారు. పాల ఉత్పత్తులు వాడకుండానే ప్రోటీన్, విటమిన్లు సమృద్ధిగా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. నగరంలో అనేక వీగన్ క్లబ్‌లు ఏర్పడి, వేలాది మంది వాటిలో సభ్యులుగా చేరారు.
ఇంట్లో వీగన్ ఆహారం తయారీ
వీగన్(Vegan Diet) వంటకాలు ఇప్పుడు ఇంట్లోనే సులభంగా తయారు చేయవచ్చు. జామ, ఆపిల్, ఉసిరి, మామిడి వంటి పండ్లు, పాలకూర, క్యారెట్, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు, బాదం, పిస్తా, వాల్‌నట్ వంటి గింజలు, టోఫు, క్వినోవా, సోయా చంక్స్ వంటి పదార్థాలతో పలు రకాల వంటకాలు తయారు చేస్తున్నారు. టోఫుతో బుర్జీ, ప్లాంట్ బేస్డ్ బిర్యానీలు, సోయా పాలు, నట్స్ పెరుగు, బాదం మిల్క్‌షేక్‌లు వంటి పదార్థాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి.
వీగన్ డైట్ అంటే ఏమిటి?
జంతు ఉత్పత్తులైన పాలు, గుడ్లు, మాంసం వంటి పదార్థాలకు దూరంగా ఉండి, కేవలం మొక్కల నుంచి లభించే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవడమే వీగన్ డైట్. పర్యావరణం, జంతు సంక్షేమం, ఆరోగ్య రక్షణ అనే మూడు లక్ష్యాలతో ఈ ఆహార పద్ధతి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: