ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పెద్దల మాట నిజం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అత్యవసరం. మనలో చాలామందికి టీ (Tea) అంటే చాలా ఇష్టం. ఉదయాన్నే ఒక కప్పు టీ (Tea) తాగని వారు చాలా తక్కువ. కొందరు ఉదయం టీ తాగితే, మరికొందరు సాయంత్రం, ఆఫీసుల్లో పని చేసేవారు రోజుకు రెండు లేదా మూడు సార్లు తప్పక టీ తాగుతుంటారు. అయితే టీ తాగేటప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలు అస్సలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
టీతో పాటు తీసుకోకూడని ఆహారాలు
పసుపు కలిపిన ఆహారాలు పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే టీతో పాటు పసుపును అస్సలు తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇది ఐరన్ లోపం, రక్తహీనతకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పాల ఉత్పత్తులు (Curd, cheese) టీతో పాటు పాల ఉత్పత్తులు, ముఖ్యంగా పెరుగు, జున్ను వంటివి తీసుకోకపోవడమే ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇది అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని పేర్కొన్నారు.

స్వీట్లు కొంతమంది టీతో పాటు స్వీట్లు (Sweets) తినడానికి ఇష్టపడతారు. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. టీలో కెఫిన్ అధిక మోతాదులో ఉంటుంది. టీతో పాటు స్వీట్లు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మధుమేహ సమస్యలకు కారణం కావచ్చని అంటున్నారు.

సిట్రస్ పండ్లు టీ తాగిన వెంటనే సిట్రస్ పండ్లు (నారింజ, నిమ్మకాయ మొదలైనవి) అస్సలు తీసుకోకూడదు. ఇది గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి టీతో పాటు లేదా టీ తాగిన వెంటనే సిట్రస్ పండ్లను తీసుకోకుండా ఉండటం మంచిది.

ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా టీ ని ఆరోగ్యకరమైన రీతిలో ఆస్వాదించవచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం!
టీ పూర్తి పేరు ఏమిటి?
14 కామెల్లియా సినెన్సిస్ (కుటుంబం: థియేసి, సాధారణ పేరు: గ్రీన్ టీ) కామెల్లియా సినెన్సిస్, థియా సినెన్సిస్, లేదా సి. థియా అనేది అస్సాంకు చెందిన సతత హరిత పొద.
టీ ఇండియన్ లేదా బ్రిటిష్?
16వ శతాబ్దం ప్రారంభంలో చైనాలోని పోర్చుగీస్ పూజారులు మరియు వ్యాపారుల ద్వారా ఇది మొదట పాశ్చాత్య ప్రపంచానికి తెలిసింది. 17వ శతాబ్దంలో బ్రిటన్‌లో టీ తాగడం ప్రజాదరణ పొందింది. టీపై చైనా గుత్తాధిపత్యంతో పోటీ పడటానికి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఇండియాకు వాణిజ్య టీ ఉత్పత్తిని ప్రవేశపెట్టింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Mosquito infestation: దోమల బెడదను ఎలా నివారించాలో తెలుసా..