ఉదయం తినే అల్పాహారం మన శరీరానికి(ProteinRich Food) రోజు మొత్తం శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రత్యేకంగా ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే, అది నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువసేపు కడుపు నిండిన భావనను ఇస్తుంది. దీనివల్ల తరచూ ఆకలి వేయకుండా, అనవసరమైన చిరుతిండి అలవాట్లను తగ్గించి, బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది. రోజువారీ ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి పనీర్ ఒక అద్భుతమైన ఆహార ఎంపిక. రుచి తగ్గకుండా పోషకాలు అందించే కొన్ని పనీర్ బ్రేక్‌ఫాస్ట్ వంటకాలను ఇప్పుడు చూద్దాం.

1. పనీర్ భుర్జీ టోస్ట్
తురిమిన పనీర్‌ను ఉల్లిపాయ, టమాటా, క్యాప్సికమ్‌తో తేలిక మసాలాల్లో వేపి సిద్ధం చేసే ఈ వంటకం త్వరగా తయారవుతుంది. ఈ భుర్జీని కరకరలాడే టోస్ట్‌పై వుంచి తింటే ఉదయం వెంటనే శక్తి అందిస్తుంది.
2. పనీర్ స్టఫ్డ్ పరోటా
పనీర్‌ను పచ్చిమిర్చి, కొత్తిమీర, వాము మొదలైన వాటితో కలిపి పిండిలో నింపి చేసిన పరోటా చాలా కాలం కడుపు నిండిన భావనను ఇస్తుంది. పెరుగు లేదా పచ్చడితో తీసుకుంటే మరింత రుచిగా ఉంటుంది.
3. పనీర్ వెజిటబుల్ ఉప్మా
ఉప్మా రవ్వకు తోడు పనీర్ ముక్కలు, క్యారెట్, బీన్స్, బఠానీలు వంటి కూరగాయలు వేసి తయారు చేసే ఈ ఉప్మా తేలికగా ఉండి, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
4. గ్రిల్డ్ పనీర్ శాండ్‌విచ్
మేరినేట్ చేసిన పనీర్ ముక్కలను తాజా కూరగాయలు, పుదీనా చట్నీతో నింపి గ్రిల్ చేస్తే అద్భుతమైన శాండ్‌విచ్ సిద్ధమవుతుంది. బయట క్రిస్పీగా, లోపల రుచిగా ఉండే ఈ శాండ్‌విచ్ బిజీ ఉదయాలకు పర్ఫెక్ట్.
5. పనీర్ ఆమ్లెట్
గుడ్డు ఆమ్లెట్‌లో తురిమిన పనీర్, కొత్తిమీర, కూరగాయలు కలిపి తయారు చేసే ఈ ఆమ్లెట్ డబుల్ ప్రోటీన్ ప్యాక్‌లా పనిచేస్తుంది. తక్కువ సమయంలో సిద్ధమయ్యే, శక్తివంతమైన(ProteinRich Food) అల్పాహారం ఇది. ఈ ఐదు పనీర్ బ్రేక్‌ఫాస్ట్ వంటకాలు మీ రోజు శక్తివంతంగా ప్రారంభించడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన అల్పాహారం కోసం వీటిని ఒకసారి తప్పక ప్రయత్నించండి!
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: