గర్భిణులు పారాసిటమాల్(Paracetamol) వాడితే పిల్లల్లో ఆటిజమ్ లేదా ADHD వచ్చే అవకాశం ఉందనే వాదనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని బ్రిటిష్ మెడికల్ జర్నల్ (BMJ) స్పష్టం చేసింది. ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో సైంటిస్టులు ఈ అంశంపై విస్తృతంగా పరిశోధించారు.
Read Also: Beauty Tips: చర్మానికి నిగారింపు తెచ్చే సులభమైన చిట్కాలు

పరిశోధన ఫలితాలు ఏమి చెబుతున్నాయి?
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు హై ఫీవర్, తలనొప్పి లేదా శరీర నొప్పులు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సందర్భంలో పారాసిటమాల్ లేదా ఎసిటమినోఫెన్ వాడడం వల్ల శిశుపై ప్రతికూల ప్రభావం ఉంటుందనే నిర్ధారణ లేనట్లు పరిశోధకులు వెల్లడించారు.
WHO మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్పష్టం
“ప్రెగ్నెన్సీలో హై ఫీవర్ స్వయంగా బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కానీ పారాసిటమాల్ (Paracetamol) అనేది అత్యంత సురక్షితమైన డ్రగ్. డాక్టర్ సూచన మేరకు తీసుకోవడంలో ఎలాంటి ప్రమాదం లేదు,” అని WHO మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్(Soumya Swaminathan) తెలిపారు.
వైద్యుల సూచనలు తప్పనిసరి
నిపుణుల ప్రకారం గర్భిణులు ఏ ఔషధం వాడినా వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. స్వయంగా మందులు వాడటం ప్రమాదకరం. తగిన డోస్, సమయం, పరిస్థితి ఆధారంగా మాత్రమే ఔషధాలు తీసుకోవాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: