వర్షాకాలంలో నీరు, బురద ఎక్కువగా పేరుకుపోతాయి. అలాంటి నీటిలో నడవడం వల్ల పాదాల గోర్లలో మురికి, బాక్టీరియా, ఫంగస్ చేరి తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. చాలామంది దీన్ని చిన్న సమస్యగా భావించినా, దీన్ని విస్మరించడం చాలా హానికరం.
ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదం
వర్షపు నీరు గోర్లలో ఎక్కువసేపు నిలిచిపోతే, ఫంగల్ ఇన్ఫెక్షన్ (Fungal infection) వచ్చే అవకాశాలు పెరుగుతాయి. గోళ్ల మూలల్లో మురికి పేరుకుని, నల్లగా మారి, దుర్వాసన వస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే గోర్లు కుళ్లిపోవడం లేదా నొప్పితో కూడిన సమస్యలు రావచ్చు.

పాదాలను శుభ్రంగా ఉంచడం ఎందుకు ముఖ్యం?
ప్రతి సారి బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు పాదాలను బాగా కడుక్కోవడం చాలా ముఖ్యం. సబ్బుతో పాదాలను శుభ్రం చేస్తే బ్యాక్టీరియా, ఫంగస్ పెరగకుండా నిరోధించవచ్చు. పాదాలు పొడిగా ఉంచడం కూడా ఇన్ఫెక్షన్లను నివారించే ముఖ్యమైన పద్ధతి.
ఇంట్లో చేయగల సులభమైన చిట్కాలు
బేకింగ్ సోడా ఉపయోగం
గోరువెచ్చని నీటిలో ఒక చెంచా బేకింగ్ సోడా వేసి పాదాలను 10 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత లూఫా లేదా బ్రష్‌తో మెల్లగా రుద్దితే మురికి, దుర్వాసన తొలగిపోతాయి.

హిమాలయన్ పింక్ సాల్ట్ స్క్రబ్
హిమాలయన్ పింక్ సాల్ట్‌లో కొబ్బరి నూనె కలిపి పాదాలను రుద్దాలి (Rub your feet with coconut oil) . ఇది పాదాల చర్మాన్ని శుభ్రం చేయడంతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.

వెనిగర్ సాక్
బకెట్‌లో సగం నీరు తీసుకుని, అందులో ఒక కప్పు వెనిగర్ వేసి 15 నిమిషాలు పాదాలను నానబెట్టాలి. ఇది బ్యాక్టీరియాను చంపి, ఫంగస్ పెరగకుండా కాపాడుతుంది. వారానికి 2-3 సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
పాద సంరక్షణలో జాగ్రత్త
పాదాలను కడిగిన తర్వాత ఎప్పుడూ టవల్‌తో బాగా తుడవాలి. తడి గోర్లు ఫంగస్ పెరిగే ప్రధాన కారణం. పాదాలకు ఫుట్ క్రీమ్ రాసుకోవడం వల్ల చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: