చర్మాన్ని(Natural Beauty) అందంగా ఉంచుకోవడానికి ఖరీదైన కాస్మెటిక్స్ అవసరం లేదని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. సహజమైన జీవనశైలి, కొన్ని సాధారణ అలవాట్లు చర్మాన్ని సహజంగానే ప్రకాశవంతంగా మార్చగలవని వారు అంటున్నారు. తగినంత నీరు తాగడం ద్వారా శరీరంలో టాక్సిన్లు బయటకు వెళ్లి చర్మం ఆరోగ్యంగా మారుతుంది. అలాగే ప్రతిరోజూ 7–8 గంటల నిద్ర పొంది చర్మానికి అవసరమైన విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. నిద్రలేమి కారణంగా వచ్చే డల్నెస్, బ్లాక్కర్కిల్స్ తగ్గుతాయి.

ఆహారం కూడా చర్మ ఆరోగ్యానికి కీలకం. పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్‌ను రోజువారీ ఆహారంలో చేర్చితే చర్మం లోపల నుంచి వెలిగిపోతుంది. ఒత్తిడి తగ్గించుకోవడం, లేదా యోగా చేయడం కూడా చర్మం మెరుపును(Natural Beauty) పెంచుతుంది. చర్మ సంరక్షణలో బేసిక్ రూటీన్ తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం, రాత్రి చర్మాన్ని క్లెన్స్ చేయడం, నాణ్యమైన మాయిశ్చరైజర్ వాడడం, అలాగే సన్‌స్క్రీన్‌ని ఏ కాలంలోనైనా తప్పక రాయడం ద్వారా సన్ డ్యామేజ్ తగ్గి చర్మం కాపాడబడుతుంది. ప్రతిరోజు చిన్న చిన్న అలవాట్లతోనే సహజ అందాన్ని కాపాడుకోవచ్చు, అని చర్మ నిపుణుల సలహా.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: