మైగ్రేన్ అనేది సాధారణ తలనొప్పి కంటే పూర్తిగా భిన్నమైన అనుభవాన్ని కలిగిస్తుంది. ఇది సాధారణంగా తల ఒక వైపున మాత్రమే తీవ్రమైన నొప్పిని కలిగిస్తూ, కొంతమందిలో అది గంటల తరబడి, మరికొంతమందిలో రోజుల తరబడి కొనసాగుతుంది. కాంతి, శబ్దం, గాలి వంటి చిన్న మార్పులకే తీవ్రంగా స్పందిస్తూ, బాధితులకు శారీరకంగా బాగా ఇబ్బందిగా మారుతుంది.
మైగ్రేన్‌కు (Migraine)శాశ్వత నివారణ సాధ్యమేనని చెబుతూ, కొన్ని జీవనశైలి మార్పులు పాటించాలని సూచించారు. మందులు కేవలం 50% ఉపశమనం ఇస్తాయని, మిగిలిన 50% బాధితుల జీవనశైలి ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
సమయానికి భోజనం – ప్రధాన మార్గం
మైగ్రేన్‌ను నియంత్రించడంలో ముందుగా చేయవలసిన ముఖ్యమైన మార్పు భోజన శైలి. ఉదయం 9 గంటలలోపు బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేయాలి. మధ్యాహ్నం 2 గంటలకు భోజనం, రాత్రి 9 గంటలకు డిన్నర్ చేయడం తప్పనిసరి. ఈ సమయాలు ప్రతి రోజు ఒకేలా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువసేపు ఆకలితో ఉండడం వల్ల మైగ్రేన్‌ను ప్రేరేపించే అవకాశం ఉంటుంది.

రాత్రి ఫోన్ వాడకాన్ని తగ్గించండి
రాత్రిపూట, ముఖ్యంగా నిద్రకి ముందు రెండు గంటలపాటు మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ వంటి డిజిటల్ పరికరాల వాడకాన్ని మానుకోవాలి. స్క్రీన్ కాంతి మెదడును ఉద్దీపన చేస్తూ నిద్రను భంగం చేస్తుంది. ఇది మైగ్రేన్‌ను మరింత తీవ్రతరం చేయగలదు.
ఖాళీ కడుపుతో టీ తాగకండి
ఉదయం ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగడం మానేయాలి(stop drinking coffee). ఇది మైగ్రేన్ నొప్పిని ప్రేరేపించడంతోపాటు, జీర్ణ సంబంధిత సమస్యలను కూడా కలిగించగలదు. బదులుగా తేలికపాటి అల్పాహారం తీసుకుని అనంతరం చాయ్ తాగడం ఉత్తమం.
ఒత్తిడిని అదుపులో పెట్టుకోండి
మైగ్రేన్‌కు ప్రధాన కారకాల్లో ఒత్తిడి ఒకటి. రోజువారీ జీవితంలో ఒత్తిడిని తగ్గించేందుకు సాధ్యమైనంత వరకు ధ్యానం, యోగా, పాజిటివ్ ఆలోచనలు అనుసరించాలి. అతి ఆలోచనను తగ్గించుకోవడం కూడా అవసరం.
ప్రతి రోజు వాకింగ్.. ఎండలో జాగ్రత్తలు
ప్రతి రోజు కనీసం 30 నిమిషాల నడక అలవాటు చేసుకోవాలి. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తూ మైగ్రేన్ తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా షేడ్స్ లేదా గొడుగు వాడాలి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: