ఉప్పు ఎప్పుడూ తేమగా మారకుండా ఉండాలంటే నిల్వ చేసే(Kitchen Tips) డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ వేయండి. ఇది అదనపు తేమను ఆకర్షించి ఉప్పును పొడిగా ఉంచుతుంది.
అల్లం, వెల్లుల్లి ఎక్కువ రోజులు తాజాగా ఉండే చిట్కా
అల్లం, వెల్లుల్లిని కాగితంలో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. ఇలా ఉంచితే అవి పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా నిలుస్తాయి.

బంగాళదుంపల మట్టి వాసన పోయే సీక్రెట్ టిప్
కొత్త బంగాళదుంపలు ఉడికించేటప్పుడు నాలుగు పుదీనా ఆకులు వేసి ఉడికించండి. దీంతో మట్టి వాసన పూర్తిగా పోతుంది.
కరివేపాకు పొడి రుచిని పెంచే చిట్కా
కరివేపాకు పొడి చేసేటప్పుడు అందులో వేయించిన నువ్వుల(Kitchen Tips) పొడి కలపండి. దీతో రుచి మాత్రమే కాకుండా సువాసన కూడా మరింత పెరుగుతుంది.
అదనంగా పాటించదగిన చిట్కాలు
- ధనియాలు తాజాగా ఉండాలంటే వాటిని గాజు బాటిల్‌లో వేసి ఫ్రిజ్‌లో ఉంచండి.
- మిరప పొడి ఎర్రగా మెరుస్తూ ఉండాలంటే కొద్దిగా ఉప్పు కలిపి నిల్వ చేయండి.
- బియ్యం కీటకాలు పడకుండా ఉండేందుకు నిమ్మకాయ తొక్కలు వేసి ఉంచండి.
ఇలా ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వంటింటి పనులు సులభంగా మారటమే కాకుండా ఆహార పదార్థాలు కూడా తాజాగా నిలుస్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: