ఫ్రిజ్‌లో దుర్వాసన(Kitchen Tips) వస్తుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక చిన్న కప్పులో బేకింగ్ సోడా(Baking soda) వేసి ఫ్రిజ్‌లోని ఒక మూలన ఉంచండి. ఇది ఫ్రిజ్‌లోని దుర్వాసనను పూర్తిగా పీల్చుకుని, వాతావరణాన్ని తాజాగా ఉంచుతుంది.
Read Also: వంటింటి చిట్కాలు.. ఆహారం తాజాగా, రుచిగా ఉండాలంటే?
కరకరలాడే బంగాళదుంప ఫ్రై కోసం చిట్కా
బంగాళదుంప ముక్కలను వేయించేముందు వాటిని పదినిమిషాలు మజ్జిగలో నానబెట్టండి. తర్వాత నీటిని వంపేసి ఫ్రై చేయండి. ఈ విధానం వల్ల ముక్కలు అతుక్కోకుండా, పొడిపొడిగా, కరకరలాడేలా వస్తాయి.

కరకరలాడే దోశల రహస్యం
దోశలు కరకరగా రావాలంటే మినప్పప్పు నానబెట్టేటప్పుడు గుప్పెడు కందిపప్పు, ఒక స్పూన్ మెంతులు, కొంచెం అటుకులు కలపండి. దీని వల్ల దోశ పిండం బాగా పులిసి,(Kitchen Tips) వేయించినప్పుడు దోశలు బంగారు రంగులో కరకరలాడుతాయి.
అదనపు చిట్కాలు
- ఫ్రిజ్‌లో నిమ్మ తొక్కలు ఉంచితే కూడా వాసన తగ్గుతుంది.
- బంగాళదుంపలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే వాటిలో ఆపిల్ వేసి ఉంచండి.
- దోశ పిండం పులవకపోతే, చిన్న స్పూన్ పెరుగు కలిపి ఉంచండి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: