ఉదయాన్నే వ్యాయామం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా తల తిరగడం, నీరసం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలను చాలామంది తేలికగా తీసుకుంటారు. అయితే, వీటి వెనక లో బ్లడ్ షుగర్ (Blood sugar)అనే తీవ్రమైన ఆరోగ్య సమస్య దాగి ఉండవచ్చు. దీనిని వైద్య భాషలో హైపోగ్లైసీమియా అని పిలుస్తారు.
హైపోగ్లైసీమియా అంటే ఏమిటి?
హైపోగ్లైసీమియా అనేది రక్తంలోని చక్కెర స్థాయిలు సాధారణ స్థాయికి కన్నా ప్రమాదకరంగా తగ్గిపోవడం. ఇది డయాబెటిస్ (Diabetes) ఉన్నవారికే కాకుండా, ఇతర ఆరోగ్యవంతులకూ ఏర్పడే అవకాశం ఉంది. సరైన సమయంలో దీన్ని గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే, ఇది స్పృహ కోల్పోవడం, కోమా స్థితి లేదా మరణం వరకు తీసుకెళ్లే ప్రమాదం కలదు.
ఈ సమస్య ఎలా గుర్తించాలి?
లో బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గితే శరీరంలో స్పష్టమైన లక్షణాలు బయటపడతాయి. ముఖ్యంగా:
- తల తిరగడం
- చెమటలు పట్టడం
- చిరాకు, ఆందోళన
- చూపు మందగించడం
- స్పృహ కోల్పోవడం
ఇవి కనిపించిన వెంటనే స్పందించకపోతే పరిస్థితి విషమమవుతుంది.

హైపోగ్లైసీమియా రాకకు కారణాలు
ఈ సమస్యకు అనేక కారణాలు ఉన్నాయి:
- భోజనం మానేయడం లేదా ఆలస్యం చేయడం
- ఖాళీ కడుపుతో ఎక్కువ వ్యాయామం చేయడం
- మద్యం సేవించడం
- డయాబెటిస్ మందుల మోతాదు తప్పుదోవ పడటం
- కాలేయం, కిడ్నీ వ్యాధులు
- హార్మోన్ల అసమతుల్యత
హైపోగ్లైసీమియాను నివారించే మార్గాలు
ఈ సమస్యను నివారించాలంటే, క్రమబద్ధమైన జీవనశైలి పాటించాల్సిందే:
- భోజనాల మధ్య విరామాలు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి
- వ్యాయామానికి ముందు మరియు తరువాత సరైన పోషకాహారం తీసుకోవాలి
- డయాబెటిస్ ఉన్నవారు గ్లూకోమీటర్‌తో షుగర్ లెవెల్స్‌ను తరచూ పరిశీలించాలి
తక్షణ చర్యలు ఏమిటి?
హైపోగ్లైసీమియా లక్షణాలు మొదట కనిపించినప్పుడు:
- తక్షణంగా గ్లూకోజ్ టాబ్లెట్ లేదా చక్కెర కలిపిన పానీయం తీసుకోవాలి
- పండ్ల రసం, స్వీట్స్ కూడా తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి
- తరచూ ఈ సమస్య ఎదురయ్యే వారు చిన్న స్నాక్స్ లేదా మిఠాయిలను వెంట తీసుకెళ్లడం మంచిది
Read hindi news: hindi.vaartha.com
Read Also