ఇంట్లో నిత్యం ఉపయోగించే వస్తువులను శుభ్రంగా(HomeTips) ఉంచుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా స్టీల్ బాటిళ్లు, రాగి పాత్రలు, వంట సమయంలో వచ్చే చిన్న ఇబ్బందులకు ఈ హోమ్ టిప్స్ ఉపయుక్తంగా ఉంటాయి.
స్టీల్ వాటర్ బాటిళ్లను శుభ్రం(HomeTips) చేయాలంటే, బాటిల్‌లో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా బేకింగ్ సోడా, అవసరమైనంత నీళ్లు వేసి మూత బిగించి సుమారు 15 నిమిషాలు అలాగే ఉంచాలి. అనంతరం బాటిల్‌ను బాగా కుదిపి, శుభ్రమైన నీటితో కడిగితే లోపల పేరుకుపోయిన మురికి, వాసన సులువుగా తొలగిపోతాయి.
రాగి పాత్రలపై అంటుకున్న జిడ్డు లేదా మలినాలు తొలగించాలంటే, నిమ్మకాయ తొక్కకు కొద్దిగా ఉప్పు కలిపి పాత్రపై రుద్దాలి. ఇలా చేస్తే పాత్ర మళ్లీ మెరుపుగా మారుతుంది. అలాగే పచ్చిమిర్చి కోసిన తర్వాత చేతులకు వచ్చే మంటను తగ్గించాలంటే, చేతులకు పంచదార రాసి రెండు నిమిషాలు ఉంచి ఆపై నీటితో కడగాలి. ఈ పద్ధతితో మంట త్వరగా తగ్గుతుంది. ఈ చిన్నచిన్న చిట్కాలు రోజువారీ ఇంటి పనులను మరింత సులభంగా మార్చుతాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: