మునుపటి కాలంలో పూజలు, పండుగలు, ఉపవాసాల సమయంలో మఖానాను(Phool Makhana) ఎక్కువగా తీసుకునే వారు. ఇప్పుడు మాత్రం ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో చాలా మంది దానిని తమ డైట్‌లో భాగం చేసుకుంటున్నారు. ‘ఫాక్స్ నట్స్’ లేదా ‘లోటస్ సీడ్స్’ పేర్లతో ప్రసిద్ధి పొందిన మఖానాను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. తక్కువ కేలరీలు, అధిక ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు(Antioxidants), ఖనిజాలు ఉండటంతో ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే అందరికీ ఇది అనుకూలం కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
Read Also: Breakfast: అల్పాహారం తినకపోయినా పరవలేదా?

మఖానా వల్ల ఎవరికీ హాని కలుగుతుంది?
కిడ్నీ సమస్యలున్నవారు:
మఖానాలో పొటాషియం అధికంగా ఉంటుంది. మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారిలో శరీరంలోని పొటాషియం స్థాయిలను సరిగా నియంత్రించలేకపోవడం వల్ల హృదయ స్పందనలో అవకతవకలు రావచ్చు. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.
మధుమేహం ఉన్నవారు:
మఖానా (Phool Makhana)తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారంగా పరిగణించినప్పటికీ, దీన్ని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిల్లో మార్పులు వస్తాయి. కాబట్టి డయాబెటిక్ రోగులు మఖానాను పరిమితంగా మాత్రమే తీసుకోవడం మంచిది.
జీర్ణ సమస్యలున్నవారు:
మఖానాలో ఉన్న అధిక ఫైబర్ జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి ఇబ్బందులు కలిగించవచ్చు. ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, మలబద్ధకం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
అలెర్జీ ఉన్నవారు:
కొంతమందికి మఖానా తింటే చర్మంపై దురద, దద్దుర్లు లేదా శ్వాసలో ఇబ్బంది వంటి అలెర్జీ లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి వారు దీన్ని పూర్తిగా నివారించాలి.
బరువు తగ్గాలనుకునేవారు:
మఖానాను వేయించే సమయంలో నెయ్యి లేదా నూనె ఉపయోగిస్తే అదనపు కొవ్వు, కేలరీలు చేరతాయి. ఇది బరువు తగ్గే ప్రయత్నాలను దెబ్బతీస్తుంది.మొత్తానికి, మఖానా పోషకమైన ఆహారం అయినప్పటికీ, దాన్ని పరిమిత పరిమాణంలో తీసుకోవడం, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుడి సలహా తీసుకోవడం అవసరం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: