ఆధునిక జీవనశైలి, పని ఒత్తిడికి తోడు మంచి ఆహారపు అలవాట్లకు దూరం కావడం వల్ల తరచూ తలనొప్పి వచ్చే సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. కానీ ఈ తలనొప్పులు తరచూ, ప్రతిరోజూ వస్తుంటే మాత్రం నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. ఇది మీ శరీరంలో ముఖ్యమైన విటమిన్ల కొరతకు సంకేతంగా ఉండొచ్చు.
విటమిన్ డి లోపం వల్ల తలనొప్పి వస్తుందా?
విటమిన్ డి (Vitamin Dఅనేది కేవలం ఎముకల ఆరోగ్యానికే కాదు, మెదడు పనితీరుకు కూడా అత్యంత అవసరం. ఈ విటమిన్ లోపం వల్ల శరీరం సరిగా స్పందించకపోవడం, మానసిక ఒత్తిడిలోకి వెళ్లడం, మరియు తరచూ తలనొప్పులు రావడం వంటి సమస్యలు తలెత్తతాయి.

విటమిన్ డి ఎలా పొందాలి?
- ఉదయపు సూర్యకాంతి – ప్రకృతి దత్తమైన ఉత్తమ వనరు
- గుడ్లు, పాలు, చేపలు, ఆకుకూరలు, గింజలు
- డాక్టర్ సిఫార్సు చేసిన సప్లిమెంట్లు (అవసరమైతే)
విటమిన్ B9 (ఫోలేట్) లోపం కూడా ఓ కారణమే
విటమిన్ B9 (Vitamin B9)లేదా ఫోలేట్ శరీరంలో కణజాలాల అభివృద్ధికి, రక్తసంచారానికి, మెదడు ఆరోగ్యానికి కీలకం. దీని లోపం వల్ల తలనొప్పి తో పాటు అలసట, దడ, మానసిక ఆందోళన వంటి లక్షణాలు కనిపించొచ్చు.
ఫోలేట్ పెంచాలంటే ఈ ఆహారాలను తీసుకోండి:
- పాలకూర, బ్రోకలీ, ముల్లంగి ఆకులు
- పప్పులు (ముఖ్యంగా మినప్పప్పు, కందిపప్పు)
- బాదం, వేరుసెనగ
- నారింజ, అరటి వంటి పండ్లు

తలనొప్పి తగ్గకపోతే జాగ్రత్త అవసరం
ఆహారపు మార్పులు చేసిన తర్వాత కూడా తలనొప్పి తగ్గకపోతే, ఇది మిగతా ఆరోగ్య సమస్యల సంకేతం కావచ్చు. మైగ్రేన్, నెరాల సమస్యలు, ఒత్తిడికి సంబంధించిన అనారోగ్యాలు వంటి సమస్యలను కూడా తప్పించకూడదు.
వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు:
- తలనొప్పి చాలా తీవ్రంగా ఉంటే
- మలమూత్ర నియంత్రణలో తేడాలు వస్తే
- చూపులో తేడా వస్తే
- తలనొప్పి తో పాటు జ్వరాలు, వాంతులు ఉంటే
Read hindi news:hindi.vaartha.com
Read Also: