అంజీర్ పండు (Figs) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లలో ఒకటి. ఇందులో ఫైబర్ (పీచు పదార్థం) మరియు పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అంజీర్ తినడం వల్ల శరీరంలో జీర్ణక్రియ మెరుగుపడుతుంది, దీర్ఘకాలిక మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అంతేకాక, ఇది రక్తపోటును (బీపీ) అదుపులో ఉంచి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అంజీర్‌లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సహాయపడి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
అంజీర్ తినడానికి ఆరోగ్యకరమైన మార్గాలు

అంజీర్(figs) పండును దాని పోషక ప్రయోజనాలను పూర్తిగా పొందేలా అనేక రకాలుగా తీసుకోవచ్చు:
- నానబెట్టిన అంజీర్: ఉదయాన్నే 2 అంజీర్ పండ్లను నానబెట్టి తినడం వలన ఫైబర్ బాగా అంది, జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
- ఓట్స్, సలాడ్‌లతో: అంజీర్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి ఓట్స్‌లో కలిపి తీసుకోవాలి. ఈ మిశ్రమంలో కొన్ని వాల్‌నట్స్‌ను కూడా జోడించడం ద్వారా గుండె ఆరోగ్యానికి తోడ్పడే అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే, పండ్ల సలాడ్స్‌లో ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, విత్తనాలతో పాటు అంజీర్‌ను కలిపి తింటే రుచి, ఆరోగ్యం రెండూ లభిస్తాయి.
- పెరుగుతో కలిపి: రెండు తాజా అంజీర్ పండ్లను పెరుగుతో కలిపి తీసుకోవడం వలన రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. హోల్ గ్రెయిన్ టోస్ట్‌ని అంజీర్, పెరుగుతో కలిపి తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.
- ఇతర పద్ధతులు: వేయించిన శనగలు, బాదంతో పాటు కొన్ని అంజీర్ ముక్కల్ని వేసి తినొచ్చు. వీటితో పాటు పాలు లేదా నీళ్లలో అంజీర్ సిరప్ కలిపి తాగడం, లేదా వివిధ రకాల సూప్‌లలో అంజీర్‌ను జోడించడం ద్వారా కూడా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పద్ధతులు మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
- Read hindi news : hindi.vaartha.com
- Epaper : epapervaartha.com