భారతదేశంలో బియ్యం అనేది ప్రతి ఇంట్లో ఉండే ముఖ్యమైన ఆహార పదార్థం. చాలామందికి బియ్యం లేకుండా భోజనం అసంపూర్ణంగా భావిస్తారు. బియ్యం జీర్ణించడానికి సులభమైన ఆహారం కావడంతో పాటు, ఇందులో శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, కొంతమంది బేసిక్ పోషకాలు కూడా ఉంటాయి.

బ్రౌన్ రైస్ – ఎక్కువ పోషకాల మూలం
బ్రౌన్ రైస్ (Brown rice) అనేది సహజంగా తక్కువ ప్రాసెసింగ్‌తో తయారవుతుంది. ఇందులో ఊక (bran) మరియు ఎండోస్పెర్మ్ సహా అన్ని భాగాలు ఉంటాయి. ఫైబర్, విటమిన్ బి (Fiber, Vitamin B), మెగ్నీషియం, మాంగనీస్, సెలీనియం వంటి పోషకాల పరంగా ఇది తెల్ల బియ్యానికి మించి ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
బ్రౌన్ రైస్‌ను ఎవరు తీసుకోవాలి?
- డయాబెటిస్ ఉన్నవారు – తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌తో రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించగలదు.
- బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారు – అధిక ఫైబర్ వల్ల పొట్ట నిండిన భావన ఉంటుంది.
- నిరంతరం జీర్ణక్రియ మెరుగుపరిచే అవసరమున్నవారు – అధిక ఫైబర్ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.
ఎవరు బ్రౌన్ రైస్ తినకూడదు?
- IBS (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్) బాధితులు – అధిక ఫైబర్ వల్ల సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.
- ఐరన్ లేదా జింక్ లోపం ఉన్నవారు – ఫైటిక్ యాసిడ్ వల్ల ఖనిజాల శోషణ తగ్గే ప్రమాదం ఉంది.

తెల్ల బియ్యం – శక్తికి మంచి వనరు
వైట్ రైస్ (White rice) ను తయారుచేసే సమయంలో ఊక తొలగించబడుతుంది. దీని వల్ల పోషకాల పరంగా కొంత నష్టమైతేనూ, ఇది శక్తిని త్వరగా అందించగలదు. ఇది సులభంగా జీర్ణమయ్యే ఆహారం కావడంతో ఆరోగ్య సమస్యలున్న వారికి మేలైన ఎంపికగా ఉంటుంది.
తెల్ల బియ్యం తినవలసిన వారు
- బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు – తేలికగా జీర్ణమవుతుంది.
- శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు – వేగంగా శక్తిని అందించగలదు.
తెల్ల బియ్యం ఎవరు నివారించాలి?
- షుగర్ ఉన్నవారు – గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర శాతం పెరిగే ప్రమాదం ఉంది.
- బరువు తగ్గే వారు – అధిక కేలరీలు బరువు పెరగడానికి దోహదపడతాయి.
బ్రౌన్ రైస్ Brown rice) ఎక్కువ పోషకాలతో నిండి ఉండటంతో ఆరోగ్య పరంగా మెరుగైన ఎంపిక. అయితే, ప్రతి ఒక్కరి శరీర పరిస్థితులు, ఆరోగ్య అవసరాలు వేర్వేరు. డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలున్నవారు బ్రౌన్ రైస్ వైపు మొగ్గు చూపాలి. కానీ జీర్ణ సమస్యలు ఉన్నవారికి తెల్ల బియ్యం బాగా సరిపోతుంది. డాక్టర్ సూచనల ప్రకారం ఆహారపు ఎంపికలు చేసుకోవడం ఉత్తమం.
read hindi news: hindi.vaartha.com
Read also: