బ్రకోలీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి అనేక పోషకాలు కలిగి ఉంటుంది. కాని, ఏ పదార్థమైనా మితిమీరి తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉంటుంది. బ్రకోలీ (Broccoli) కూడా ఇందుకు అతీతం కాదు.
బ్రకోలీ వల్ల కలిగే సమస్యలు
జీర్ణ సమస్యలకు దారి తీసే అధిక ఫైబర్
బ్రకోలీ (Broccoli) లో విపరీతమైన ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను శక్తివంతంగా పనిచేసేలా చేస్తుంది. కానీ అధికంగా తీసుకుంటే కడుపు ఉబ్బరం, వాయువు, మలబద్ధకం (Constipation) వంటి సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా జీర్ణతంత్రం బలహీనంగా ఉన్నవారు బ్రకోలీని అధికంగా తీసుకోవడం వల్ల అసౌకర్యం ఎదుర్కొనవచ్చు.

థైరాయిడ్ సమస్యలు పెరిగే అవకాశం
బ్రకోలీలో గోయిట్రోజెన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో అయోడిన్ గ్రహణాన్ని అడ్డుకుంటుంది. ఫలితంగా థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఇది థైరాయిడ్ గ్రంథిపై ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నవారు బ్రకోలీని ఎక్కువగా తినడం వల్ల సమస్య మరింతగా పెరిగే ప్రమాదం ఉంది.
బ్లడ్ థిన్నర్ మందులు తీసుకునేవారికి హెచ్చరిక
బ్రకోలీలో విటమిన్ కె అధికంగా (High in vitamin K) ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది. అయితే, బ్లడ్ థిన్నర్స్ (రక్తం పల్చబెట్టే మందులు) వాడుతున్నవారికి ఇది ఇబ్బంది కలిగించవచ్చు. బ్రకోలీలోని విటమిన్ కె ఆ మందుల ప్రభావాన్ని తగ్గించేసి, రక్తం గడ్డకట్టే అవకాశాన్ని పెంచుతుంది. కాబట్టి, అలాంటి వారు బ్రకోలీని తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

అలెర్జీ ప్రమాదం
బ్రకోలీ కొందరికి అలెర్జీని కలిగించే అవకాశం ఉంది. దద్దుర్లు, చర్మం మీద దురద, వాపు, శ్వాస సంబంధిత ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మితంగా తీసుకోవడమే ఉత్తమం
బ్రకోలీ ఆరోగ్యానికి మంచిదే. కానీ అది ఎంత ఆరోగ్యకరం అయినా కూడా, మితిమీరి తీసుకుంటే అది ప్రమాదకరమవుతుంది. ప్రత్యేకంగా ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు బ్రకోలీని ఆహారంలో చేర్చేముందు వైద్యుడి సలహా తీసుకోవడం ఉత్తమం.
Read hindi news: hindi.vaartha.com
Read also: