భారతదేశంలో బ్రెయిన్ ట్యూమర్ కేసులు అంతగా కనిపించకపోయినా, ఇటీవల కాలంలో యువతలో ఇది పెరుగుతున్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారిలో బ్రెయిన్ క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరిగాయని పరిశోధనలు చెబుతున్నాయి.
భారతదేశంలో గణాంకాలు ఎలా ఉన్నాయంటే..
నేషనల్ హెల్త్ పోర్టల్ ఆఫ్ ఇండియా ప్రకారం, భారతదేశంలో ప్రతి లక్ష మందిలో 5 నుండి 10 మందికి మాత్రమే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరం భారత్‌లో సుమారు 28,000 కొత్త కేసులు, 24,000 మరణాలు నమోదవుతున్నాయి. ప్రపంచస్థాయిలో బ్రెయిన్ క్యాన్సర్ కారణంగా 3 లక్షలకుపైగా కేసులు మరియు 2.5 లక్షలకుపైగా మరణాలు జరుగుతున్నాయి.

ఏ వయసులో ఎక్కువ ప్రమాదం?
బ్రెయిన్ ట్యూమర్ అన్నది ఏ వయసులోనైనా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ప్రధానంగా 65 సంవత్సరాల పైబడిన పెద్దలు, 15 సంవత్సరాల లోపు పిల్లలు ఎక్కువ రిస్క్ కేటగిరీలోకి వస్తారు. పిల్లలలో ప్రత్యేకంగా గ్లియోమాస్ (Gliomas) అనే క్యాన్సర్ రకం అధికంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో, 31-40 ఏళ్ల మధ్యవయసు వారు, అలాగే 20-39 ఏళ్ల యూత్ సైతం ఈ వ్యాధికి బలవుతున్నట్టు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
లింగాన్ని బట్టి తేడాలు
ఈ డిసీజ్ పరంగా మహిళల్లో కేసుల శాతం కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మగవారికంటే మహిళల్లో బ్రెయిన్ ట్యూమర్ అభివృద్ధి చెందే అవకాశం కొద్దిగా ఎక్కువగా ఉందన్న విషయం ఇప్పుడు పరిశోధనల ద్వారా బయటపడుతోంది.
ట్యూమర్ రకాలేమిటి?
- పిల్లల్లో: ప్రధానంగా గ్లియోమాస్ (Gliomas) అనే క్యాన్సర్ రకం కనిపిస్తుంది.
- పెద్దవారిలో: ఎక్కువగా మెనింగియోమాలు (Meningiomas) ఉండే అవకాశముంది.
- క్యాన్సర్ రకాలు వయసు, లింగం వంటి అంశాలపై ఆధారపడి మారుతుంటాయి. అందుకే ట్రీట్‌మెంట్ విధానాలు కూడా వ్యక్తిపరంగా మారవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Read also: