పాలు కేవలం ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా అద్భుత ఫలితాలు ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. పాల్లో ఉండే లాక్టిక్ యాసిడ్(Lactic acid) చర్మంలోని మృత కణాలను తొలగించి సహజ నిగారింపు తీసుకొస్తుంది.
Read also: Child care: చలి తీవ్రతతో పిల్లల్లో పెరుగుతున్న దగ్గు, జలుబు కేసులు

తేనెతో పాలు మిశ్రమం
రెండు చెంచాలు(Beauty Tips) పచ్చి పాలు, ఒక చెంచా తేనె కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. కాటన్ బాల్స్ సహాయంతో ముఖంపై అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది.
అరటిపండుతో పాల మాస్క్
సగం అరటిపండు, కొద్దిగా పచ్చిపాలు(Beauty Tips) వేసి మెత్తగా కలపాలి. ఆ పేస్ట్‌ను ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మానికి మెరుపును, తేమను అందిస్తుంది.
తరచూ ఉపయోగించటం వల్ల కలిగే లాభాలు
ఈ సహజ చిట్కాలను వారంలో 2–3 సార్లు పాటిస్తే చర్మం ప్రకాశవంతంగా, తేమతో నిండినదిగా మారుతుంది. కెమికల్ ఉత్పత్తుల వాడకం తగ్గి సహజ అందం నిలిచి ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: